Begin typing your search above and press return to search.
మహేష్ నుంచి విజయ్ కా - నిజమేనా?
By: Tupaki Desk | 3 Nov 2018 11:02 AM GMTరంగస్థలం తర్వాత చేయాల్సిన సినిమా కోసం మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకుని కథను సిద్ధం చేసే పనిలో దర్శకుడు సుకుమార్ గత కొద్ధి నెలలుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజాకర్ల నేపథ్యంలో నిజాం పాలన కాలం నాటి కథను మహేష్ చెప్పాడని కాని అందరూ అదే రూట్ లో వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వర్క్ అవుట్ కాదని ప్రిన్స్ చెప్పినట్టుగా వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. సరే వేరేది చూద్దామంటూ సుక్కు మరో కథను వండే పనిలో పడ్డాడని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడే కథ కొత్త మలుపు తిరిగిందట.
తానెంతో ఇష్టపడి రాసుకున్న కథ మహేష్ కు నచ్చకపోయినా ఇంకో హీరోతో అయినా చేసుకోవాలన్న ఆలోచనలో సుకుమార్ విజయ్ దేవరకొండతో దీన్ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఎలాగూ కుర్రాడు తెలంగాణ నేపధ్యం నుంచే వచ్చాడు కాబట్టి ఇంకా బాగా సూటవుతాడు అనే ఆలోచన కారణం కావొచ్చు. కానీ ఇది నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం గాసిప్ రూపంలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ మహర్షి లో తలమునకలై ఉన్నాడు. మార్చ్ దాకా ఖాళీ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏప్రిల్ 5 విడుదల కాబట్టి ఆ నెల కూడా ప్రమోషన్ లో బిజీ ఉంటాడు.
ఆ తర్వాత ఓ నెల రెస్ట్ అనుకున్నా జూన్ నుంచి మాత్రమే అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ విజయ్ దేవరకొండ తో సెట్ అయితే ఆరు నెలల టైంలో సినిమా పూర్తి చేయడం సుకుమార్ కు పెద్ద కష్టమేమి కాదు. మరి ఇది నిజంగా ఈ కోణంలో సుకుమార్ ఆలోచించాడా తెర వెనుక ఇంత జరిగిందా అనేది తేలడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు. వేచి చూస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.