Begin typing your search above and press return to search.

రంగ‌స్థ‌లం బ‌ట్ట‌లు మురికి వెనుక క‌థ ఇది!

By:  Tupaki Desk   |   9 April 2018 7:07 AM GMT
రంగ‌స్థ‌లం బ‌ట్ట‌లు మురికి వెనుక క‌థ ఇది!
X
తెలుగు సినిమా అంటేనే రిచ్ నెస్ కు కొద‌వ ఉండ‌దు. ఈ పిచ్చ ఎంత‌వ‌ర‌కంటే హీరో కూలీ అయినా.. పోర్ట‌ర్ అయినా బ్రాండెడ్ ష‌ర్టులు వాడేంత‌. తిండికి తిఖానా లేకున్నా.. ఇంటి వాతావ‌ర‌ణంలో మాత్రం రిచ్ నెస్ కు కొద‌వ ఉండ‌దు. అలా అల‌వాటైన తెలుగు సినిమాకు భిన్నం రంగ‌స్థ‌లం.

ఈ సినిమా చూసినంత‌సేపు తెర‌పైన పాత్ర‌లు క‌నిపిస్తాయే కానీ న‌టీన‌టులు క‌నిపించ‌రు. హీరో.. హీరోయిన్లు మాత్ర‌మే కాదు అన్ని క్యారెక్ట‌ర్లు అలానే ఉంటాయి. ఇక‌.. ఇంటి ప‌రిస‌రాలు.. వాళ్లు వాడే వ‌స్తువులు అన్ని పాత‌గా.. ప‌ల్లెటూరులో ఎలా ఉంటాయో అలానే క‌నిపిస్తాయి. ర‌స్టీగా క‌నిపించే ఈ మూవీ తెలుగోళ్ల‌కు స‌రికొత్త ఫీల్ ను ఇచ్చింద‌ని చెప్పాలి.

ఇలాంటి త‌ర‌హా ఎక్కువ‌గా త‌మిళ సినిమాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో చూస్తే.. రంగ‌స్థ‌లంలోనే ఇలాంటి తీరు క‌నిపిస్తుంది. రాంచ‌ర‌ణ్‌.. స‌మంత లాంటి స్టార్ క్యాస్ట్ క్యాస్టూమ్స్ సైతం మురికి మురికిగా క‌నిపిస్తూ.. వారు పోషించిన పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు ఉంటాయి. ఇదెలా చేశారంటే ఇంట్ర‌స్టింగ్ విష‌యాన్ని చెప్పారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.

సినిమాకు త‌గ్గ‌ట్లే కాస్టూమ్స్ ఉండాల‌ని బ‌లంగా అనుకున్నామ‌ని.. హీరో.. హీరోయిన్ మొద‌లుకొని ఆర్టిస్టుల అంద‌రి బ‌ట్ట‌లు మురికిగా ఉంటాయ‌ని.. కావాల‌నే మురికిగా చేశామ‌న్నారు. టీ.. డికాష‌న్.. కాఫీలో బ‌ట్ట‌ల్ని ముంచి తీసేవాళ్ల‌మ‌ని.. హీరో.. హీరోయిన్ ఎవ‌రి కాస్ట్యూమ్స్ అయినా ఇదే తీరులో చేశామ‌న్నారు. టూ.. త్రీ వాషెస్ క‌చ్ఛితంగా అవ్వాల్సిందేన‌ని.. టార్గెట్ పెట్టుకొని చేయ‌టం వ‌ల్ల అలాంటి ఫీల్ వ‌చ్చింద‌న్నారు. సుక్కు టార్గెట్ ఏమో కానీ.. అందుకు ఓకే అన్న చెర్రీ.. సామ్ ను అభినందించాల్సిందే.