Begin typing your search above and press return to search.
ఉయ్యాలవాడ.. రోమాలు నిక్కబొడుచుకున్నాయి
By: Tupaki Desk | 16 July 2017 4:25 AM GMTమెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు అరడజను మంది రచయితల సహకారంతో కొన్ని నెలల నుంచి ఈ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. దీంతో ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుందని మెగా అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. వాళ్ల అంచనాల్ని మరింత పెంచే వ్యాఖ్యలు చేశాడు సుకుమార్. ‘దర్శకుడు’ ఆడియో వేడుకకు అతిథిగా వచ్చిన సురేందర్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రస్తావన తెచ్చాడు సుక్కు.
తాను.. సురేందర్ రెడ్డి దాదాపుగా ఒకేసారి సినీ రంగంలో ప్రయాణం మొదలుపెట్టామని.. ఐతే తాను ఏడాది ముందుగా దర్శకుడినయ్యానని.. తన సినిమా ‘ఆర్య’ మే 7న విడుదలైతే.. తర్వాతి ఏడాది అదే తేదీకి సురేందర్ తొలి సినిమా ‘అతనొక్కడే’ విడుదలైందని.. రెండు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయని సుక్కు చెప్పాడు. సురేందర్ తనకు నిజాయితీగా తన కథల్ని పూర్తిగా చెబితే.. తాను మాత్రం సగం సగమే చెప్పి అతణ్ని మోసం చేసేవాడినని చమత్కరించాడు సుక్కు.
తనకు కథలు సరిగా నరేట్ చేయడం రాదని.. కానీ సురేందర్ మాత్రం చాలా ఆవేశంతో.. ఎమోషన్ తో కథలు చెప్పేవాడని.. ‘అతనొక్కడే’ కథను అలాగే చెప్పాడని.. నాకు చెప్పినట్లే తీస్తే సినిమా సూపర్ హిట్టవుతుందని చెప్పానని.. ‘అతనొక్కడే’ అదే తరహాలో తీసి హిట్టు కొట్టాడని.. సురేందర్ కథ చెబుతున్నపుడు మళ్లీ అంత ఎమోషన్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ విషయంలోనే చూశానని సుక్కు తెలిపాడు. ఒక్కో సీన్ చెబుతుంటే.. ‘రంగస్థలం’ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. ప్రతి సన్నవేశం ఎగ్జైటింగ్ గా అనిపించిందని.. సినిమా చాలా పెద్దదవుతుందని.. హిట్టు కొట్టేస్తున్నావు అని చెప్పానని సుకుమార్ తెలిపాడు.