Begin typing your search above and press return to search.
సుక్కును.. డైరెక్టర్ ఏం చేస్తాడని అడిగిందట
By: Tupaki Desk | 9 April 2018 11:30 PM GMTస్టార్ డైరెక్టర్ సినిమాలో అదిరిపోయే సీన్లు మామూలే. కానీ.. రియల్ లైఫ్ లో సినిమాటిక్ సీన్లు ఉండటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. కానీ.. సుకుమార్ కు మాత్రం ఆ లోటు లేదు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. సినిమాలో న్యారేట్ చేసేందుకు సరిపోయే బోలెడన్ని సీన్లు సుక్కు రియల్ లైఫ్ స్టోరీ వింటున్నప్పుడు ఉన్నాయనిపిస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు చెప్పాడు. అన్నింటికి మించిన తన భార్య గురించి సుక్కు చెప్పిన మాటలు వింటే.. ఒక పట్టాన నవ్వు ఆగదంతే. సుకుమార్ లాంటి డైరెక్టర్ తో.. డైరెక్టర్ ఏం చేస్తాడని అడగటం.. అందుకు సుక్కు చెప్పిన వైనం.. దానికి అమాయకత్వంతో ఆమె వేసిన కౌంటర్ లాంటివన్నీ ఆయన మాటల్లో వింటేనే ఆనందం.
తన లవ్ స్టోరీ.. తన భార్య గురించి చెప్పిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన పర్సనల్స్ గురించి సుక్కు చెప్పిన మాటల్ని యథాతధంగా చదివితే నవ్వులే నవ్వులు. ఇంతకీ.. సుక్కు ఏం చెప్పారంటే..
"మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అది కూడా సినిమా హాల్లో. కనిపించింది... మాట్లాడింది. నేనే ధైర్యం చేసి ఫోన్ నెంబర్ ఇచ్చేశా. తన అమాయకత్వం వల్ల నా ఇగో బాగా దెబ్బతింది. అక్కడే నా లవ్ స్టోరీ మొదలైంది. ‘ఆర్య’ పెద్ద హిట్టయింది. దీంతో నేను పెద్ద డైరెక్టర్ ననుకుంటున్నాను. తనేమో ‘డైరెక్టర్ ఏం చేస్తాడు’ అని అడిగింది. ‘కెమెరామన్ తీస్తాడు. ఆర్టిస్ట్ లు యాక్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు. మరి నువ్వేం చేస్తావ్’ అంది! (నవ్వు). ‘అలా కాదు... నేను బన్నీకి ఎలా చేయాలో చెబుతాను’ అంటే... ‘బన్నీకి నువ్వు చెప్పేదేంటి? బన్నీ యాక్టర్... అతనే చేస్తాడు కదా’ అనేసింది. ఇప్పటికీ తనేం పెద్దగా పట్టించుకోదు" అని చెప్పారు.
రంగస్థలం సినిమా రిలీజ్ ముందు రోజు రాత్రి నేను టెన్షన్ తో నిద్ర లేకుండా కూర్చుంటే.. తనేమో హ్యాపీగా నిద్ర పోయింది. తనెంత అమాయకురాలంటే.. "సినిమాల్లో ఇంత డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నా.. ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తాయని గానీ తెలియదు. ‘1...నేనొక్కడినే’ ఫ్లాప్ అయినప్పుడు నేను బాధపడుతుంటే తనొచ్చి... ‘అమెరికాలో లెక్కలు చెబితే నెలకు లక్ష రూపాయిలు వస్తాయట. చాలా ఆఫర్లు ఉన్నాయట. హ్యాపీగా బతికేయొచ్చు కదా? అని మాట్లాడింది" అంటూ నవ్వుతూ చెప్పేశాడు.