Begin typing your search above and press return to search.

సుక్కు సిగ్గుపడి ‘రంగస్థలం’ చేశాడట

By:  Tupaki Desk   |   15 March 2018 12:16 PM GMT
సుక్కు సిగ్గుపడి ‘రంగస్థలం’ చేశాడట
X
తొలి సినిమా ‘ఆర్య’తో మొదలుపెడితే అన్నీ అర్బన్ బేస్డ్ కథలతోనే సినిమాలు చేశాడు సుకుమార్. అందులోనూ ఈ మధ్య ‘1 నేనొక్కడినే’.. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాలతో లోకల్ నేటివిటీకి బాగా దూరమైపోయాడు. ఆ సినిమాల్ని పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించాడు. ఆ కథల నేపథ్యం కూడా అక్కడిదే. ఐతే రెండేళ్ల కిందట ఒక వ్యక్తి తనను కలిసినపుడు తన సినిమాలు బాగుంటాయని అభినందిస్తూనే మన నేపథ్యంతో.. ముఖ్యంగా పల్లె నేపథ్యంలో ఎందుకు సినిమా చేయరంటూ ప్రశ్నించాడని సుకుమార్ తెలిపాడు. అతనన్న ఆ మాటకు సిగ్గుపడి తాను ‘రంగస్థలం’ సినిమా చేశానని సుకుమార్ వెల్లడించాడు.

తాను 28 ఏళ్ల పాటు పల్లెటూరిలోనే పెరిగానని.. ఐతే సినిమాలు మాత్రం విదేశాల నేపథ్యంలో చేసుకుంటూ వెళ్లానని.. ఐతే ఒక వ్యక్తి తనకు బ్రేక్ వేశాడని.. ‘రంగస్థలం’ పూర్తి స్థాయి పల్లెటూరి సినిమా అని సుకుమార్ అన్నాడు. తన జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఈ సినిమా తీసినట్లు అతను చెప్పాడు. ప్రతి పల్లెటూరు నాటక రంగానికి ప్రతీక అని.. అక్కడ రకరకాల మనుషులు.. పాత్రలు ఉంటాయని సుకుమార్ అన్నాడు. అందుకే అన్ని పల్లెటూళ్లను కలిపేలా ఈ చిత్రానికి ‘రంగస్థలం’ అని పేరు పెట్టినట్లు సుకుమార్ వెల్లడించాడు. ఈ రోజు నిర్మాత నవీన్ ఎర్నేనితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్న సుకుమార్ ‘రంగస్థలం’ ఈ నెల 30న పక్కాగా విడుదలవుతుందన్న స్పష్టత కూడా ఇచ్చాడు.