Begin typing your search above and press return to search.

రంగస్థలం.. ఫ్రెష్ మైండ్ తో వెళ్లండి

By:  Tupaki Desk   |   29 March 2018 6:09 PM GMT
రంగస్థలం.. ఫ్రెష్ మైండ్ తో వెళ్లండి
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రంగస్థలం సినిమా విడుదల సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రవాసులు అయితే మనకంటే ముందే చూడటానికి రెడీ అయ్యారు. ప్రీమియర్స్ టికెట్లను కూడా తీసుకున్నారు. అయితే సినిమా రేపు విదలవుతోన్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యింది. దర్శకుడు సుకుమార్ చిత్ర విశేషాలను తెలియజేశారు.

సుకుమార్ ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్లు చెప్పాడు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్లాలని. ఒక ఖాళీ కాగితంలాగా ఫ్రెష్ మైండ్ తో థియేటర్స్ లోకి వెళితే సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని సుక్కు తెలిపాడు. ఇక సినిమాలో నటించిన నటీనటుల గురించి మాట్లాడమే కాకుండా తనకు ఎంతగానో హెల్ప్ చేసిన ప్రొడక్షన్ టీమ్ గురించి కూడా వివరించాడు. ముఖ్యంగా తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెప్పాడు. రైటర్స్ కూడా పల్లెటూరికి వెళ్లి మరీ కొన్ని సన్నివేశాలను రాశారని చెప్పారు.

ఇక సినిమా నిడివి గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా రెండు గంటల 50 నిముషాలు ఉంటుంది. అన్ని సీన్స్ బాగా వచ్చాయి. కానీ లెంత్ ఎక్కువైందని మొదట కొన్ని సీన్స్ ను కట్ చేద్దామని అనుకున్నాను. కానీ చిరంజీవి గారు సినిమా చూశాక ఒక్క ససీన్ కూడా తీయడానికి వీల్లేదని చెప్పారు. ఆయన అనుభవంతో చెప్పారు కాబట్టి సినిమాను లెంత్ తగ్గించకుండా రిలీజ్ చేస్తున్నాం. ఇక రాహుల్ ద్రావిడ్ మిగతా యాడ్స్ తో కలిపి మూడు గంటలు అయ్యిందని చెబుతూ.. చివరగా సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని సుకుమార్ ఆశాభావం వ్యక్తం చేశాడు.