Begin typing your search above and press return to search.
వట్టి సుకుమార్ నే నమ్ముకుంటే ఎలా?
By: Tupaki Desk | 17 Nov 2015 11:30 AM GMTకేవలం సుకుమార్ అనే పేరు వినేసి ఈ సినిమాను చేసేశాం అంటున్నారు హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ హీబా పటేల్ లు. అసలు 'కుమారి 21 ఎఫ్' సినిమాను ఓకె చేయడానికి కారణం ఏంటమ్మా అంటే.. అబ్బే సుక్కూ సార్ కంటే పెద్ద రీజన్ ఏముంటుంది.. అందుకే ఎస్ చెప్పేశాం అంటున్నారు కాని.. అసలు ఈ సినిమాను ఎందుకు ఒప్పుకుంది అనే విషయం మాత్రం చెప్పట్లేదు.
నిజానికి సుకుమార్ సినిమాలంటే కుర్ర హీరోలకు ఎందుకు మోజు? ఒక విధంగా సుకుమార్ సినిమాల్లో కొత్త ఎమోషన్ లు ఉంటాయ్.. కొత్త కొత్త క్యారెక్టరైజేషన్లు ఉంటాయ్ అని చెబుతారు. కాని ఆయన కొత్తగా ప్రయోగాలు చేసినప్పుడల్లా బాక్సాఫీస్ రిజల్టు దెబ్బేసింది. తొలి సినిమా నుండి మొన్నటి 1 నేనొక్కడినే వరకు.. అనుకున్న బడ్జెట్ ఒకటి.. చివరకు సుకుమార్ చేతిలో సినిమా పూర్తయ్యేనాటికి ఖర్చయ్యేది ఒకటి. అందుకే సుక్కూ సినిమాలు కాస్ట్ ఫెయిల్యుర్ గా దర్శనమిచ్చేది. కంటెంట్ ఎంత గొప్పగా ఉన్నా డబ్బులు రికవర్ కాకపోతే సినిమా తీయడం ఎందుకు? మరి ఇవన్నీ తెలిసి కూడా ఈ కొత్త నటీనటులందరూ సుకుమార్ నిర్మాత అని చూడగానే ఆయన శిష్యుడు డైరక్షన్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారా? కామెడీగా లేదూ.
నిజానికి ఆర్య అనే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ కెరియర్ ను ఓ రేంజులో టర్న్ చేశాడు సుకుమార్. మేబి అందుకేనేమో.. అందరూ ఆర్య టైపులో స్టార్ అయ్యే ఛాన్సు సుక్కూ సినిమాలతో వస్తుందని రాజ్ తరుణ్ ఈ సినిమా ఒప్పుకొని ఉంటాడు.. కాదంటారా? ఇకపోతే కథ కేకలు పెట్టించింది అంటారా?? ఏ దర్శకుడైనా కూడా కేకలు పెట్టించని కథను ఎందుకు రెడీ చేస్తాడు, ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాడు చెప్పండి?