Begin typing your search above and press return to search.

లెంగ్త్‌ విషయంలో అసలు ఇష్యూ లేదే

By:  Tupaki Desk   |   2 Feb 2016 3:26 AM GMT
లెంగ్త్‌ విషయంలో అసలు ఇష్యూ లేదే
X
మామూలుగా ఒక సినిమా నిడివి రెండున్నర గంటల అనుకుంటే.. సుకుమార్‌ వంటి దర్శకులు.. సినిమాను 4 గంటల లెంగ్త్‌ కు తీసి.. ఆ తరువాత కొన్ని సీన్లు లేపేస్తున్నారని ఒక టాక్‌. అయితే దీని కారణంగా అనవసరమైన లెంగ్త్‌ తీసి.. నిర్మాతలకు షూటింగ్‌ రోజులను పెంచేసి.. అధిక ఖర్చుకు సుకుమార్‌ కారణమవుతున్నాడనే ఆరోపణా ఉంది.

ఇదే విషయం సుకుమార్‌ ను అడిగితే.. హాలీవుడ్‌ సినిమాలైతే.. డైరక్టర్‌ కట్‌ సినిమాలో కనీసం 10 సీన్లు ఎక్కువగా ఉంటాయని.. కాని తాను అలా ఏమీ చేయట్లేదని చెప్పాడు. పైగా నాన్నకు ప్రేమతో సినిమా లెంగ్త్‌ ముందు 3 గంటల 40 నిమిషాలు వచ్చిందని.. తరువాత 2 గంటల 40 నిమిషాలకు కుదించారనే రూమర్లను ఖండించాడు. ''మేం తీసిన సినిమా నిడివి కరెక్టుగా 3 గంటలు వచ్చింది. అందులో 3 సీన్లు తీసేశాను. ఒక పావుగంట తగ్గి ఉంటుంది మినహా.. మిగిలిన సినిమా అంతా నేను అనుకున్న లెంగ్త్‌ లోనే ఉంది. మేం ఒకేసారి ఎడిటింగ్‌ అండ్‌ ట్రిమ్మింగ్‌ చేయడం వలన... ఇలాంటి రూమర్లు వచ్చుంటాయి. కాని అందులో నిజం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్‌.

నిజానికి సుకుమార్‌ సినిమాలన్నింటికంటే ఈ నాన్నకు ప్రేమతో విషయంలోనే లెంగ్త్‌ తను ఊహించినట్లు వచ్చిందని దర్శకుడు చెబుతున్నాడు. ఏదేమైనా సినిమా హిట్టయ్యింది కాబట్టి.. ఆడుతోంది కాబట్టి.. లెంగ్త్‌ గురించి ఇప్పుడు కామెంట్లు అనవసరం.