Begin typing your search above and press return to search.

12 పాసయింది.. 'కుమారి 21' సీక్వెల్?

By:  Tupaki Desk   |   1 July 2019 1:03 PM GMT
12 పాసయింది.. కుమారి 21 సీక్వెల్?
X
ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ - ట్రైల‌ర్ తోనే `దొర‌సాని`గా శివాత్మిక‌ ఆక‌ట్టుకుంది. నేడు ట్రైల‌ర్ ఈవెంట్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అతిధిగా ఘ‌నంగా జ‌రిగింది. వేదిక‌పై డెబ్యూ హీరోయిన్ శివాత్మిక ద‌ర్శ‌కుడు సుకుమార్ పై అభిమానం వ్య‌క్తం చేసిన విధానం అహూతుల‌ను ఆక‌ర్షించింది. ``సుకుమార్ గారు .. మీరంటే నాకు ఎప్ప‌టినుంచో ఎంతో అభిమానం!`` అంటూ త‌న‌వైపు చూస్తూ శివాత్మిక ఎగ్జ‌యిట్ అవ్వ‌డం ఆక‌ట్టుకుంది.

అయితే ఈ వేదిక‌పైకి సుకుమార్ రావ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఇది కేవ‌లం జీవిత రాజ‌శేఖ‌ర్ పై గౌర‌వం.. దొర‌సాని ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యానే కాదు.. వేరొక కార‌ణం ఉంద‌ట‌. సుకుమార్ ప్ర‌స్తుతం త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాల‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సినిమాల‌పైనా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. న‌వ‌త‌రంలో ట్యాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చి సుకుమార్ రైటింగ్స్ లో సినిమాలు నిర్మించ‌నున్నారు. ఇక ఈ బ్యాన‌ర్ లో వ‌చ్చిన `కుమారి 21ఎఫ్` (హెబ్బా ప‌టేల్ క‌థానాయిక‌) చిత్రం అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కించే ప్లాన్ కూడా ఉంద‌ట‌. ఒరిజిన‌ల్ ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ `కుమారి 21ఎఫ్` సీక్వెల్ క‌థ‌ను రాస్తున్నార‌ని ఇప్ప‌టికే ప్ర‌చార‌మైంది. బ‌న్నితో మూవీ స్క్రిప్టు స‌హా ఇత‌ర‌త్రా స్క్రిప్టుల‌పైనా సుక్కూ గ‌ట్టిగానే వ‌ర్క్ చేస్తున్నార‌ట‌.

బ‌హుశా శివాత్మిక‌ను `కుమారి 21ఎఫ్` సీక్వెల్ కి ఎంపిక చేస్తార‌న్న ముచ్చ‌టా వేదిక వ‌ద్ద‌ సాగింది. ఇప్ప‌టికే శివాత్మిక 12 వ త‌ర‌గ‌తి పూర్తి చేసుకుంది. ఇంట‌ర్ గాళ్ కుమారి అయితే బావుంటుంద‌న్న‌ది సుక్కూ ఆలోచ‌న అట‌. అయితే ఇది ఇప్పటికి గాసిప్ అయినా ఇదే నిజం అయితే బావుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అస‌లు సుక్కూ మైండ్ లో ఏం ఉంది అన్న‌ది అధికారికంగా అట్నుంచి వివ‌రం తెలియాల్సి ఉంటుంది. దొర‌సాని ట్రైల‌ర్ వేడుక‌లో శివాత్మిక న‌ట‌న‌- యాస గురించి సుకుమార్ మాట్లాడుతూ ఓ రేంజులో పొగిడేశారు. ``శివాత్మిక పర్‌ ఫెక్ట్ తెలంగాణ అమ్మాయిలా కనపడుతోంది. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తెర‌పై ఎంతో బాగుంది!!`` అని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక డెబ్యూ హీరో ఆనంద్ పైనా సుక్కూ ప్ర‌శంస‌లు కురిపించారు. ``విజయ దేవరకొండలో కనిపించిన నిజాయితీ.. వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాటల్లో కూడా కనిపించిందని అన్నారు. దొర‌సాని చిత్రం జూలై 12న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.