Begin typing your search above and press return to search.

రంగస్థలంలో జగపతి.. చాలా సెక్సీ అట

By:  Tupaki Desk   |   2 April 2018 4:36 PM IST
రంగస్థలంలో జగపతి.. చాలా సెక్సీ అట
X
‘రంగస్థలం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ అందరి గురించి మాట్లాడాడు కానీ.. జగపతిబాబు.. ప్రకాష్ రాజ్ ల ఊసే ఎత్తలేదు. వాళ్ల ప్రస్తావన వచ్చినపుడు ఇప్పుడు కాదు సినిమా విడుదలయ్యాక మాట్లాడతానని అన్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా జగపతిబాబును ఆకాశానికెత్తేశాడు సుకుమార్.

జగపతిబాబు బంగారం అని.. ఆ బంగారాన్ని ఏ రూపంలోకి మార్చినా అది అందంగానే ఉంటుందని అన్నాడు సుకుమార్. తాను ఇంతకుముందు తీసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు స్టైలిష్ బిజినెస్ మ్యాన్ పాత్రలో జగపతిబాబు నటించాడని.. అప్పుడు ఆ లుక్ లో అందరూ ఆయన్ని చూసి చాలా సెక్సీగా ఉన్నాడని కాంప్లిమెంట్ ఇచ్చారని సుకుమార్ తెలిపాడు.

ఇప్పుడు ‘రంగస్థలం’ సినిమాలో పంచె కట్టుతో.. పాలు పితుకుతూ మొరటు విలన్ పాత్రలో జగపతిబాబు కనిపించారని.. ఐతే ఇప్పుడు కూడా తనకు చాలా కాల్స్ వస్తున్నాయని.. చాలామంది జగపతిబాబు ఈ పాత్రలో కూడా సెక్సీగానే ఉన్నారని అంటున్నారని సుక్కు తెలిపాడు. బంగారం ఏ రూపంలో ఉన్నా అందంగానే ఉంటుందనడానికి ఇది రుజువని సుకుమార్ అన్నాడు. జగపతిబాబు నటన సినిమాకు పెద్ద బలంగా నిలిచిందని.. ప్రెసిడెంట్ పాత్రను అద్భుతంగా చేశాడని సుకుమార్ చెప్పాడు.