Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నవ్వుకు ఎన్ని కోట్లయినా ఇవ్వొచ్చొట

By:  Tupaki Desk   |   27 Jan 2016 7:30 AM GMT
ఎన్టీఆర్ నవ్వుకు ఎన్ని కోట్లయినా ఇవ్వొచ్చొట
X
జూనియర్ ఎన్టీఆర్ ప్రేమ తుఫాన్ నుంచి సుకుమార్ ఇంకా బయటికి వచ్చినట్లు లేడు. తన హీరో మీద ‘నాన్నకు ప్రేమతో’ విడుదలకు ముందు నుంచి ప్రశంసలు కురిపిస్తూ వస్తున్న సుకుమార్.. ఇప్పటికే ఆ పొగడ్తల్ని ఆపట్లేదు. ‘నాన్నకు ప్రేమతో’ కోసం ఎన్టీఆర్ తో పని చేయడం తనకు లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్ అని.. దాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతూ.. సినిమాలోని ఓ స్పెషల్ సీన్ గురించి వెల్లడించాడు సుక్కు.

‘‘ఇంటర్వెల్ కు ముందు జగపతి బాబుతో ఛాలెంజ్ చేశాక ఎన్టీఆర్ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్లే సీన్ ఉంటుంది. నేను జస్ట్ నడుచుకుంటూ వెళ్లిపోమన్నాను. ఎందుకు ఏంటి అని అడక్కుండా వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో దాని గురించి నన్ను క్వశ్చన్ చేస్తాడనుకున్నా. కానీ చేయలేదు. అలా వెళ్లేటపుడు ఓ నవ్వు నవ్వాడు. అది అద్భుతం. ఆ నవ్వుకు ఎన్ని కోట్లయినా ఇవ్వొచ్చు. కొందరు హీరోలు కూడా ఫోన్ చేసి ఆ నవ్వు గురించి నాతో మాట్లాడారు’’ అని సుక్కు చెప్పాడు.

సినిమాలో మిగతా నటీనటుల స్మైల్ మూమెంట్స్ గురించి కూడా సుక్కు ప్రస్తావించాడు. తన తండ్రికి తన లవ్ గురించి చెప్పే సీన్లో ఇచ్చిన స్మైల్ సూపర్ అని.. అలాగే జగపతి బాబు నా ఆస్తి ఎంతో తెలుసా అంటూ ఎన్టీఆర్ ను చూసి ఇచ్చే స్మైల్ బాగుంటుందని.. ఇక రాజేంద్ర ప్రసాద్ చనిపోతూ ఇచ్చే స్మైల్ అద్భుతమని సుక్కు చెప్పాడు. ఎన్టీఆర్ క్లైమాక్స్ సీన్లో బాధను తనలోనే దాచుకుంటా అంటూ ఇచ్చే స్మైల్ కూడా చాలా స్పెషల్ అని సుక్కు అన్నాడు.