Begin typing your search above and press return to search.

ప‌ర‌శురామ్ కు సుక్కు గొప్ప కాంప్లిమెంట్‌

By:  Tupaki Desk   |   14 Aug 2016 1:21 PM GMT
ప‌ర‌శురామ్ కు సుక్కు గొప్ప కాంప్లిమెంట్‌
X
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో జంధ్యాల త‌ర్వాత అంత గొప్ప రైట‌ర్ కం డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న‌వాడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. ముఖ్యంగా ర‌చ‌యిత‌గా త్రివిక్ర‌మ్ కు ఎలాంటి పేరుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అలాంటి వాడితో పోల్చి ప‌ర‌శురామ్ కు మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు మ‌రో టాప్ డైరెక్ట‌ర్ సుకుమార్‌. త్రివిక్ర‌మ్ త‌ర్వాత తెలుగులో అంత గొప్ప రైట‌ర్ ప‌ర‌శురామే అని కితాబిచ్చాడు సుక్కు. ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’ స‌క్సెస్ మీట్లో భాగంగా సుక్కు ఈ వ్యాఖ్య‌లు చేశాడు.సుక్కు లాంటి గ్రేట్ డైరెక్ట‌ర్ నుంచి ఈ కాంప్లిమెంట్ అందుకోవ‌డం అంటే ప‌ర‌శురామ్ గ‌ర్వించాల్సిన విష‌య‌మే. ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ సినిమా మీద కూడా సుక్కు ప్ర‌శంస‌లు కురిపించాడు.

మాట‌లు రాయ‌డంలో ప‌ర‌శురామ్ మొద‌ట్నుంచి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘సోలో సినిమాతో అత‌డి క‌లం బ‌ల‌మేంటో అంద‌రికీ తెలిసొచ్చింది. ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’తో మ‌రోసారి అత‌ను త‌న టాలెంట్ రుజువు చేసుకున్నాడు. ఈ సినిమాలో మ‌న‌సుకు హ‌త్తుకునే మాట‌లు రాశాడు ప‌ర‌శురామ్. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో డైలాగులు అద్భుతంగా కుదిరాయి. ఈ నేప‌థ్యంలో అంద‌రూ అత‌డిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ‘సారొచ్చారు’ డిజాస్ట‌ర్ కావ‌డంతో తీవ్ర నిరాశ‌కు గురైన ప‌ర‌శురామ్ కు ‘శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు’ మంచి ఉత్సాహాన్నిచ్చింది.