Begin typing your search above and press return to search.
పుష్ప పై నిర్ణయాన్ని విరమించుకున్న క్రియేటివ్ డైరెక్టర్
By: Tupaki Desk | 30 April 2020 5:00 PM GMTభారీ గ్యాప్ తర్వాత 'అల వైకుంఠపురంలో' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత స్టైలిష్ అల్లు అర్జున్. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప మీద ఇప్పటికే అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇండియా మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్టపడుతున్నారట. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది.
ఈ సినిమా కథాంశం శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. దాదాపు 60 శాతం సినిమా షూటింగ్ అడవుల్లోనే నిర్వహించనున్నారు. మరోసారి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ తో సుకుమార్ ఈ సినిమాని తీర్చిదిద్దాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్సులతో సాగనుందట. ఇక ఈ సినిమాకోసం సుకుమార్ ఫారెన్ నుండి స్టంట్ మాస్టర్లను, యాక్షన్ టెక్నీషియన్లను పిలిపించాలని అనుకున్నారట. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకొని మన దేశంలోని టెక్నీషియన్లతో రూపొందించాలని భావిస్తున్నారట. చూడాలి మరి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్న సంగతి తెలిసిందే..