Begin typing your search above and press return to search.

'పుష్ప‌-2' పారితోషికంలో సుకుమార్ లెక్క మారిందా?

By:  Tupaki Desk   |   5 Oct 2022 12:30 PM GMT
పుష్ప‌-2 పారితోషికంలో సుకుమార్ లెక్క మారిందా?
X
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పుష్ప` ది రైజ్ పాన్ ఇండియాలో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 350 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. హిందీ బెల్ట్ నుంచే అనూహ్య వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఉత్త‌రాదిన ఈ రేంజ్ లో స‌క్సెస్ అవుతుంద‌ని సుకుమార్ స‌హా ట్రేడ్ సైతం గెస్ చేయ‌లేదు. దీంతో సుకుమార్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది.

ద‌ర్శ‌క దిగ్గ‌జాలు రాజ‌మౌళి...ప్ర‌శాంత్ నీల్ స‌ర‌స‌న నిలిచారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఇండియాలో ఫేమ‌స్ డైరెక్టర్ల‌గా మారిపోయారు. రాజ‌మౌళి..ప్ర‌శాంత్ నీల్ ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారంటే ఆ సినిమాలో పారితోషికానికి బ‌ధులు వాటా తీసుకుంటున్నారు. త‌మ ప్ర‌తిభ‌నే సినిమాలో పెట్టుబ‌డిగా చూపించి షేర్ తీసుకుంటున్నారు.

ఇప్పుడీ జాబితాలో సుకుమార్ కూడా చేరిపోయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. `పుష్ప‌-2` కోసం సుకుమార్ ఇంత వ‌ర‌కూ మైత్రీ మూవీ మేక‌ర్స్ నుంచి ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదుట‌. స‌క్సెస్ అయిన త‌ర్వాత వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకుందామ‌నే ఉద్దేశంతోనే సుకుమార్ పారితోషికం విష‌యంలో సైలెంట్ గా ఉన్న‌ట్లు వినిపిస్తుంది.

`పుష్ప` విడుద‌ల‌కు ముందు సుకుమార్ ఆ సినిమాకు గానూ 20 కోట్లు తీసుకున్న‌ట్లు స‌మాచారం. థియేట్రికల్ మార్కెట్‌లో ఈ చిత్రం 150 కోట్లకు అమ్ముడైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ 190+ కోట్ల షేర్ తెచ్చింది. డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులతో సహా నిర్మాతలు దాదాపు 300 కోట్లకు పైగా లాభాలు చూసారు.

ఇక అల్లు అర్జున్ మొద‌టి భాగానికి 50 కోట్లు ఛార్జ్ చేయ‌గా... రెండవ భాగానికి 110+ కోట్లకు పైగా తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఆ లెక్క‌న పుష్ప -2 కోసం సుకుమార్ సులభంగా 50-70 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఆయ‌న‌
నిర్మాతల్ని డిమాండ్ చేసి ఒత్తిడి చేయ‌డం క‌న్నా స‌క్సెస్ అయితే అందులో వాటా తీసుకుంటే మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో `సుకుమార్ రైటింగ్స్` ఈ చిత్రానికి సహ నిర్మాతగా మారినట్లు సమాచారం. అదే నిజమైతే సినిమా నికర లాభాల నుండి లెక్క‌లు మాష్టారు వాటా తీసుకుంటారు. నివేదికల ప్ర‌కారం చూస్తే ఆ లెక్క‌న‌ ఈజీగా సుకుమార్ కి 70-90 కోట్ల వరకు రావొచ్చన్న‌ది ఓ అంచ‌న‌గా తెలుస్తోంది.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.