Begin typing your search above and press return to search.

సుకుమార్ భయపడ్డాడా?

By:  Tupaki Desk   |   30 March 2018 4:52 AM GMT
సుకుమార్ భయపడ్డాడా?
X
సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే ‘రంగస్థలం’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక గత కొన్ని నెలల్లో ఈ చిత్రాన్ని చాలా వైవిధ్యంగా, ఆసక్తికర రీతిలో ప్రమోట్ చేసి చాలా జాగ్రత్తగా హైప్ పెంచుకుంటూ వచ్చారు. టీజర్, ట్రైలర్.. ఇతర ప్రోమోలు కూడా ఆసక్తిని పెంచాయి. ఇక ఆల్రెడీ సినిమా చూసిన చిరంజీవి ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పిన మాటలతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. రామ్ చరణ్ కెరీర్లో ‘మగధీర’ తర్వాత అత్యంత అంచనాలు నెలకొన్నది ఈ సినిమా మీదే. ఐతే ఈ అంచనాలు దర్శకుడు సుకుమార్ ను భయపెట్టినట్లుగా ఉన్నాయి. గతంలో కొన్ని సినిమాలప అంచనాలు మరీ ఎక్కువ కావడం కూడా ప్రతికూలమైంది.

ఈ నేపథ్యంలో సుకుమార్ కొంచెం ఆందోళన చెంది.. ఈ అంచనాల్ని తగ్గించే ప్రయత్నం చేసినట్లున్నాడు. విడదులకు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక దర్శకుడు తన సినిమాపై ఏ అంచనాలు పెట్టుకోకుండా రండి.. వైట్ పేపర్ లాగా వస్తే సినిమాను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకుముందు సుకుమార్ తీసిన ‘1 నేనొక్కడినే’ అంచనాలకు భిన్నంగా ఉండి ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు ‘రంగస్థలం’ విషయానికి వస్తే ఇది ఊర మాస్ సినిమా అనే అంచనాలున్నాయి. అయితే ఎంత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసినా.. సుక్కు పూర్తిగా తన శైలిని విడిచిపెట్టి.. ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ వదిలేసి ఉంటాడా అన్నది సందేహం. అందుకే తన సినిమాపై ఏదో అంచనాలతో రావొద్దని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చినట్లున్నాడు సుక్కు. సుక్కు అన్నట్లుగా అసలేమాత్రం అంచనాల్లేకుండా సినిమాకు ఎవ్వరూ వెళ్లరు కానీ.. మరీ ఏదో ఊహించుకుని మాత్రం వెళ్లకపోవడం మంచిదేమో.