Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో నాలుగ్గంటలా.. హహహ
By: Tupaki Desk | 22 Jan 2016 11:30 AM GMTసుకుమార్ ఇష్టానుసారం తీసుకుంటూ పోయాడట.. సినిమా నిడివి నాలుగ్గంటలు అయిపోయిందట. దాన్ని రెండున్నర గంటలకు తగ్గించలేక కిందా మీద పడిపోయారట. ఎన్టీఆర్ స్వయంగా ఎడిటంగ్ టేబుల్ దగ్గర కూర్చుని కత్తెర పట్టి సినిమాను తగ్గించాడట. అయినప్పటికీ సినిమా 2 గంటల 45 నిమిషాలు వచ్చిందట.. ఇలా ‘నాన్నకు ప్రేమతో’ గురించి విడుదలకు ముందు రకరకాల రూమర్లు వినిపించాయి. కొన్ని మంచి సన్నివేశాల్ని కూడా సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిందని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఐతే అదంతా శుద్ధం అబద్ధం అంటూ నవ్వేస్తున్నాడు సుకుమార్. నిడివి కొంచెం మాత్రమే ఎక్కువైందని.. సినిమా నుంచి ఒక్క సన్నివేశం మాత్రమే తీసేశామని అతను వెల్లడించాడు.
‘‘ప్రథమార్ధంలో వచ్చే ఒకే ఒక్క సన్నివేశం మాత్రమే తీసేశాం. మిగతా సినిమా అంతా ఎలా ఉందో అలాగే ఉంచాం. ఆ తీసేసిన సీన్ కూడా బావుంటుంది. దాన్ని ఇప్పుడు థియేటర్లలో కలుపుతున్నారు’’ అని సుక్కు వెల్లడించాడు. ఎన్టీఆర్ కోసం ఇంకో కథ రాశారు కదా.. మరి ఆ సినిమా పట్టాలెక్కేదెప్పుడు అని సుక్కును అడిగితే.. ‘‘ఎన్టీఆర్ కోసం కథ సిద్ధంగా ఉన్న మాట వాస్తవం. అయితే ఆ సినిమా చేసేది లేనిది ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే ఎన్నో విషయాలు కుదరాలి’’ అన్నాడు. దేవిశ్రీ హీరోగా సినిమా గురించి ప్రస్తావించగా.. ‘‘ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. నా నిర్మాణంలో నా శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వంలో తీయాల్సిన ‘దర్శకుడు’ మీద ఫోకస్ పెట్టాను. అదొక క్యూట్ లవ్ స్టోరీ’’ అని వెల్లడించాడు సుక్కు.