Begin typing your search above and press return to search.
జగపతిని చూస్తే సుక్కుకు భయమెందుకు?
By: Tupaki Desk | 28 Dec 2015 11:30 AM GMTజగపతి బాబు గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు నడుస్తుంటాయి. జగపతి క్యాజినోలకు వెళ్లి పందేలు కాసి కోట్లకు కోట్లు నష్టపోయాడని.. డబ్బంటే అస్సలు లెక్క ఉండదని.. విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడని.. ఇలా కోట్లకు కోట్లు పోగొట్టుకున్నాడని.. రకరకాల ప్రచారాలున్నాయి జగపతి విషయంలో. ఐతే ఈ ప్రచారాల్ని చాలా లైట్ తీసుకుంటుంటాడు జగపతి. ఆ వార్తల్ని ఖండించడు. అలాగని ఔననీ అనడు. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా సుకుమార్ మాటల్ని బట్టి చూస్తే జగపతి ఓ విలక్షణమైన వ్యక్తి అని.. డబ్బుకు ఆయన పెద్దగా విలువివ్వరని అర్థమవుతుంది.
సుకుమార్ జగపతిబాబుతో ఇదివరకే పని చేశాడట. ఆ సినిమా.. హనుమాన్ జంక్షన్. దీనికి సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టరట. ఐతే అప్పటి అనుభవాల్ని గుర్తుంచుకుని జగపతి తన సినిమాలో నటిస్తున్నాడనగానే చాలా భయపడ్డాడనని అన్నాడు సుక్కు. ఎందుకా భయం అంటే.. ‘‘జగపతి బాబు గారు సెట్లో ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్లందరికీ ఆయన డబ్బులిచ్చి ఎంజాయ్ చేయమంటారు. హనుమాన్ జంక్షన్ రోజుల్లో నాకు కూడా అలాగే డబ్బులిచ్చారు. అందుకే నాన్నకు ప్రేమతో షూటింగ్ టైంలో చాలా భయపడ్డాను. నేను అనుకున్నట్లే అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఆయన చుట్టూనే తిరుగుతుండేవారు’’ అని చెప్పాడు సుక్కు.