Begin typing your search above and press return to search.

బన్నీ కోసం అడవుల వేట

By:  Tupaki Desk   |   7 May 2019 5:39 PM IST
బన్నీ కోసం అడవుల వేట
X
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్ తో జాయిన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ ఫైనల్ అయ్యిందని స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజి లో ఉందని టాక్ ఉంది. ఇదిలా ఉండగా ఇందులో బ్యాక్ డ్రాప్ అడవి ఎర్ర చందనం దొంగతనం తరహాలో సాగుతుందన్న సంగతి తెలిసిందే.

వీటి మీద బ్రతికే మాఫియాను అడ్డుకునే పవర్ ఫుల్ రాబిన్ హుడ్ తరహా పాత్రనే బన్నీ పోషిస్తాడని ఇన్ సైడ్ న్యూస్. ఇప్పుడు దీని కోసమే లొకేషన్ల వేటలో సుకుమార్ ఉన్నట్టు తెలిసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పేరొందిన శేషాచలం అడవుల్లో ప్రస్తుతం సుక్కు టీం పర్యటనలో ఉందట

అక్కడ షూటింగ్ చేసుకోవడానికి ఉన్న సౌలభ్యం అనుమతులు వచ్చే అవకాశం లాంటి వివరాలు కనుక్కోవడంతో పాటు ఒకవేళ అక్కడ కుదరకపోతే దానికి ప్రత్యాన్మయంగా హైదరాబాద్ లోనే సెట్స్ వేయడం గురించి కూడా చర్చిస్తున్నట్టు తెలిసింది. త్రివిక్రమ్ ది పూర్తయ్యే లోపు ఎంత లేదన్నా కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. కాబట్టి సుకుమార్ ఆ లోపే క్యాస్టింగ్ తో సహా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలి. అందుకే సుక్కు ఈ పని మీద చాలా బిజీగా ఉన్నట్టు టాక్. మే 11 లాంచనంగా పూజా కార్యక్రమాలతో మొదలుకానున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది