Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో క్లైమాక్స్.. ఐదు వెర్షన్లు
By: Tupaki Desk | 26 Jan 2016 9:30 AM GMTఇప్పటికే చాలా చర్చ జరిగింది ‘నాన్నకు ప్రేమతో’ క్లైమాక్స్ సీన్ గురించి. ఐతే విడుదలకు ముందు ఈ సన్నివేశం గురించి మరీ అతిగా చెప్పడం వల్ల.. ప్రేక్షకులు మరీ ఎక్కువ అంచనాలతో సినిమా చూశారు. కానీ ఆ సన్నివేశం అనుకున్న స్థాయిలో కిక్కివ్వలేదు. ఐతే ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌ను మాత్రం తక్కువ చేసి చూడ్డానికి లేదు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని, ఎమోషన్ ను ముందు బాగా బిల్డ్ చేసి ఉంటే ఆ సన్నివేశం బాగా అనిపించేదేమో. ఆ సంగతలా ఉంచితే ఈ సన్నివేశానికి సుకుమార్ ఏకంగా ఐదు వెర్షన్లు చేయించుకున్నాడట. ఇలాంటి సన్నివేశం ఒకటి చేయడం కష్టమంటే ఐదుసార్లు పెర్ఫామ్ చేయడమంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆ ఐదు వెర్షన్ల గురించి ఎన్టీఆర్ చెబుతూ.. ‘‘ఫస్ట్ వెర్షన్ లో నాతో సహా అందరూ ఎమోషనల్ అయిపోయారు. నిజంగానే గట్టిగా ఏడ్చేశారు. టెక్నీషియన్లు కూడా ఏడ్చారు. ఇక రెండో వెర్షన్ లో కొంచెం డోస్ తగ్గింది. ఇక మూడో వెర్షన్ లో నేనొక్కణ్నే గట్టిగా ఏడ్చాను, అరిచాను. నాలుగో వెర్షన్ లో ఒక్కొక్కరు ఒక్కోలా చేశారు. ఇక చివరి వెర్షన్ లో ఎవ్వరూ ఏడవలేదు. కళ్లల్లో కన్నీటి పొర మాత్రమే ఉంటుంది. నాతో సహా అందరూ అలాగే చేశారు. అప్పుడు పర్ ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే అభిరామ్ క్యారెక్టరైజైషన్ ప్రకారం అలాగే చేయాలి. ఎక్కువ ఏడవకూడదు. అన్నింట్లోకి అది బెస్ట్ అనిపించి.. ఆ సన్నివేశాన్నే ఫైనల్ వెర్షన్ లో ఉంచాం’’ అని ఎన్టీఆర్ చెప్పాడు. ఐతే ఎన్టీఆర్ మిగతా వెర్షన్లలో కూడా అద్భుతంగా చేశాడని.. దాన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అని సుకుమార్ అభిప్రాయపడగా.. ఎన్టీఆర్ వద్దన్నాడు. అందులో ఏదైనా బాగుందనిపిస్తే.. జనాలకు సినిమాలో ఉన్నదాని విలువ తగ్గిపోతుందని, కాబట్టి దాన్ని బయటికి తేవొద్దని సుక్కుతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.