Begin typing your search above and press return to search.

నేను మాస్.. ఎన్టీఆరే క్లాస్- సుకుమార్

By:  Tupaki Desk   |   28 Dec 2015 6:07 AM GMT
నేను మాస్.. ఎన్టీఆరే క్లాస్- సుకుమార్
X
సుకుమార్ అనగానే అందరూ క్లాస్ డైరెక్టర్ అనుకుంటారు. కానీ తాను మాస్ అంటున్నాడు సుకుమార్. అదే సమయంలో ఎన్టీఆర్ ను అందరూ మాస్ డైరెక్టర్ అంటారు. కానీ సుక్కునే అతను చాలా క్లాస్ అని చెబుతున్నాడు. ఈ మాస్-క్లాస్ లెక్కలేంటో సుకుమార్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను అందరికీ క్లాస్ డైరెక్టర్లాగా కనిపిస్తాను. కానీ నా ఆలోచనలు చాలా మాస్ గా ఉంటాయి. ఐతే ఎన్టీఆర్ ను అందరూ మాస్ హీరో అంటారు. అలాగే కనిపిస్తాడు. తన సినిమాల్లో ఫైట్లు - బ్లడ్డూ అదీ ఉంటాయి. కానీ అతను క్లాస్ మనసున్న హీరో. తన గదిలోకి వెళ్లామంటే అత్యంత మెలోడీ పాటలే వినిపిస్తాయి. ఆ మెలోడీ సాంగ్స్ అతను అద్భుతంగా పాడతాడు. తను పాడుతుంటే వింటూ ఉండిపోతాం. ఒక ఆల్బంలో అన్ని పాటలూ పాడగల హీరో ఎన్టీఆర్ ఒక్కడే. ఎన్టీఆర్ ఎంత క్లాసో ఒక్క ఉదాహరణ చెబుతా. నాన్నకు ప్రేమతో టైటిల్ డిజైన్ చేసి బయటికి వదిలాక అందరూ అందులో కనిపించే ‘హార్ట్ బీట్’ డిజైన్ చాలా బాగుందన్నారు. ఏం టచ్ ఇచ్చారు సార్ అని మెసేజ్ లు పెట్టారు. ఐతే ఆ టైటిల్ డిజైన్ తారక్ ఆలోచన’’ అని చెప్పాడు సుక్కు.

ఎన్టీఆర్ లాంటి నటుణ్ని, సింప్లిసిటీ ఉన్న హీరోను ఇంత వరకు చూడలేదని సుక్కు చెప్పాడు. ‘‘నాకేదైనా సెట్లో స్పాంటేనియస్ గా చెప్పడం అలవాటు. ‘నాన్నకు ప్రేమతో’ షూటింగులోనూ ఇలాగే ఎన్టీఆర్ కు వెళ్లి అప్పటికప్పుడు సీన్ చెప్పేవాడిని. సాధారణంగా డైరెక్టర్ - అసిస్టెంట్ డైరెక్టర్లు సీన్ - డైలాగులు రాసి హీరోకిస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఎన్టీఆర్ కు సీన్ చెబితే అతను అసిస్టెంట్ డైరెక్టర్లకు డైలాగులు చెప్పేవాడు. వాళ్లు రాసుకునేవాళ్లు. ఇలా తారక్ చెబితే సీన్ రెడీ అయ్యేది. తనెంత సింపుల్ అంటే.. షూటింగ్ జరుగుతుంటే వెళ్లి మూలన స్టెప్స్ మీద మామూలుగా కూర్చునేవాడు. మరీ ఇంత సింపుల్ గా ఉండటమేంటి.. డ్రెస్ పాడైపోతుంది అని చెప్పేవాణ్ని. ఎన్టీఆర్ హైలో చేయడం.. ‘లో’లో చేయడం.. అంటూ ఉండదు. ఎంత అవసరమో అంత చేస్తాడు. సెట్స్ మీద ఎన్ని కరెక్షన్స్ చెప్పినా విసుక్కోకుండా అప్పటికప్పుడు అవగాహన చేసుకుని నటిస్తాడు. అతడితో పని చేయడం గొప్ప అనుభవం’’ అని సుక్కు చెప్పాడు.