Begin typing your search above and press return to search.
చెర్రీ, సుక్కులకు రాక్ స్టార్ తోడయ్యాడు
By: Tupaki Desk | 21 May 2016 5:30 PM GMTరామ్ చరణ్ ప్రస్తుతం తని ఒరువన్ రీమేక్ ను.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవగా తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది దసరాకి ధృవను రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది.
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. చెర్రీ-సుకుమార్ ల సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి కూడా. రామ్ చరణ్ తో ఓ లవ్ స్టోరీని తీసేందుకు రెడీ అవుతున్న సుకుమార్.. ఇప్పుడీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేసేశాడు. తన ఫేవరేట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ నే మరోసారి జట్టులోకి తెచ్చుకున్నాడు సుక్కు.
ఇప్పటికే స్టోరీ ఓకే అయిపోగా, స్క్రిప్ట్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఆ వెంటనే సుక్కు-రాక్ స్టార్ లు కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తారట. ఆగస్టులో మూవీని స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా ఫినిష్ చేసేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే.. సంక్రాంతి నాటికే రేసులో ఉండాలని భావిస్తున్నారట. అయితే సుక్కు స్టైల్ తెలిసిన వాళ్లెవరూ దీన్ని నమ్మలేకపోతున్నా.. మూడు నెలల ముందే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవుతుండడంతో.. ఈసారి సుకుమార్ ఏమైనా అద్భుతం సష్టిస్తాడా అనుకుంటున్నారు.