Begin typing your search above and press return to search.
ఓటీటీకి దారి కడుతున్న సినిమాలు!
By: Tupaki Desk | 28 April 2021 5:30 PM GMTగత లాక్ డౌన్ లో ఓటీటీల హవా కొనసాగింది. పలు చిన్న సినిమాలు స్మార్ట్ స్క్రీన్లో రిలీజ్ అయ్యాయి. అయితే.. థియేటర్లు తెరుచుకోవడంతో కాస్త ప్రాధాన్యం తగ్గింది. ఇప్పుడు మరోసారి థియేటర్లు మూతపడడంతో మళ్లీ ఓటీటీ పైకి లేస్తోంది. ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకునే ఛాన్స్ కనిపించకపోవడంతో.. ఆయా ఓటీటీ సంస్థలు సినిమాలతో బేరసారాలు ఆడుతున్నట్టు సమాచారం.
వకీల్ సాబ్ తర్వాత కొత్త సినిమా ఏదీ రాలేదు. రిలీజులకు ప్రణాళికలు వేసుకున్న వారంతా వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద చిత్రాలంటే.. వాయిదా అనివార్యం. కానీ.. చిన్న సినిమాలు ఎక్కువ కాలం వేచి చూసే పరిస్థితి ఉండదు. అందుకే.. అలాంటి సినిమాలతో ఓటీటీ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ లిస్టులో పాగల్, గల్లీ రౌడీ, గుడ్ లక్ సఖీ, ఆకాశవాణి వంటి సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద చిత్రాలను తీసుకొని రిస్క్ తీసుకోవడం కన్నా.. చిన్న చిత్రాలనే లైన్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాయట ఓటీటీ సంస్థలు. ఒకవేళ పెద్ద చిత్రాలు తీసుకున్నా.. పే ఫర్ వ్యూస్ మెథడ్ ఫాలో కావాలని చూస్తున్నాయని సమాచారం.
ఇక, పవన్ వకీల్ సాబ్, తమిళ్ హీరో కార్తీ ‘సుల్తాన్’ కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఈ నెల 30న స్ట్రీమింగ్ కానున్నాయి. వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో, సుల్తాన్ ఆహా ఓటీటీలో ప్రసారం కానున్నాయి. మొత్తానికి.. ఓటీటీల హవా మరోసారి కొనసాగనుందని అర్థమవుతోంది. మరి, అది ఎంత కాలం కొనసాగుతుందన్నది చూడాలి.