Begin typing your search above and press return to search.
బ్యాడ్ సెంటిమెంట్ కి ఎదురెళ్లి మరీ హిట్ కొడతాడా..?
By: Tupaki Desk | 16 March 2021 3:30 PM GMTకోలీవుడ్ హీరో కార్తీ 'యుగానికొక్కడు' 'ఆవారా' 'నా పేరు శివ' 'ఊపిరి' 'ఖాకీ' 'ఖైదీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సుల్తాన్'' చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు - ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగులో 'సుల్తాన్' సినిమా వర్కవుట్ అవుతుందో లేదో అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
'సుల్తాన్' అనే టైటిల్ వేరే భాషల్లో వర్క్ అవుట్ అయిందేమో కానీ తెలుగులో మాత్రం ఈ టైటిల్ పై చాలా బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. 1999లో నందమూరి బాలకృష్ణ హీరోగా.. కృష్ణ - కృష్ణంరాజు ప్రధాన పాత్రలతో ''సుల్తాన్'' అనే సినిమా వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పరాజయం అయింది. ఇప్పుడు ప్లాప్ మూవీ టైటిల్ తో కార్తీ వస్తున్నాడు. దీనికి తోడు 'ఖైదీ' తర్వాత కార్తీ నటించిన 'దొంగ' సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు దాని ప్రభావం కూడా 'సుల్తాన్' పై పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. తెలుగులో ఈ టైటిల్ కి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ వెరసి 'సుల్తాన్' కి సంబంధించిన ట్రేడ్ వాల్యూని బాగా తగ్గించేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాకపోతే ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై తెలుగులో కూడా కాస్త ఆసక్తిని కలిగించాయి. 'భారతంలో కృష్ణుడు పాండవుల పైపు నిలబడ్డాడు.. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే.. అదే మహాభారతాన్ని యుద్ధం లేకుండా ఊహించుకోండి' అంటూ వచ్చిన టీజర్ అలరించింది. అలానే లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ అవడం ఇక్కడ కలిసొచ్చే అంశమని చెప్పాలి. ఈ నేపథ్యంలో కార్తీ 'సుల్తాన్' తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం సమకూర్చగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించారు.