Begin typing your search above and press return to search.
‘సుల్తాన్’ రాకను ఏ శక్తీ అడ్డుకోలేదట..!
By: Tupaki Desk | 24 March 2021 12:30 AM GMTకరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేంద్రం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే.. ఈ పరిస్థితి సినీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. కేసుల తీవ్రత పెరిగితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే భయం కూడా ఉంది నిర్మాతల్లో. ముఖ్యంగా సమ్మర్ లో స్లాట్ బుక్ చేసుకున్న సినిమాలకు సంబంధించి ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది.
ఏప్రిల్, మే నెలలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ వకీల్ సాబ్, బాలయ్య బీబీ-3 వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే.. తమిళ్ స్టార్ కార్తీ ‘సుల్తాన్’ కూడా రాబోతోంది. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని నిర్ణయించారు మేకర్స్. కానీ.. కొంత కాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. తమిళనాట ఎన్నికల హడావిడి నేపథ్యంలో.. సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ నడిచింది. అంతేకాకుండా.. కరోనా కేసులు పెరిగే సూచనలు కనిపిస్తుండడం మరో కారణం అన్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో ఏప్రిల్ 2న సుల్తాన్ వస్తాడా? రాడా? అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్.
టైమ్ దగ్గరపడుతున్నప్పటికీ క్లారిటీ రావట్లేదని ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ విషయమై చిత్ర నిర్మాత ప్రభు ఎట్టకేలకు స్పందించారు. ఆరు నూరైనా సుల్తాన్ ఏప్రిల్ 2న బాక్సాఫీస్ బరిలో నిలుస్తారని తేల్చి చెప్పారు. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పూ లేదని ప్రకటించిన ఆయన.. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు. దీంతో.. అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. సుల్తాన్ కు లైన్ క్లియర్ అయిపోయింది.