Begin typing your search above and press return to search.
వృత్తి ధర్మం వేసిన సంకెళ్లు!
By: Tupaki Desk | 9 Aug 2019 6:42 AM GMTచేసే వృత్తిని గౌరవించడం ప్రేమించడం చాలా ముఖ్యం. అంకితమై నిజాయితీగా పని చేసేవాళ్లు.. కమిట్ మెంట్ విషయంలో రాజీకి రానివాళ్లు మాత్రమే సక్సెస్ ని అందుకోగలరన్నది నిత్యసత్యం. అలాంటి ఆలోచనతో కమిట్ మెంట్ తో ప్రపంచంలో గొప్ప స్థానాలకు ఎదిగిన వారు ఎందరో. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలాంటి వాళ్లలోని కమిట్ మెంట్ ఎంత? అన్నదానికి ప్రూఫ్ ప్రత్యక్షంగా దొరుకుతుంది.
ది గ్రేట్ టీమిండియా బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్.. తండ్రి మరణించిన మరుసటి రోజే టీమ్ కోసం మైదానంలోకి దిగాల్సి వచ్చింది. బాధను అణచుకుని ఆయన ఆరోజు ఆట ఆడారు. అంతెందుకు మొన్న నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ సోదరుల పరిస్థితి అంతే. ఓవైపు తండ్రిని కోల్పోయిన బాధ వెంటాడుతున్నా అంత్యక్రియలు ముగిశాక తిరిగి యథావిధిగా ఇచ్చిన కమిట్ మెంట్ కోసం షూటింగుల్లో జాయిన్ అయ్యారు. ప్రతి వేదికపైనా తమ తండ్రిగారు నేర్పిన కమిట్ మెంట్ గురించి తలచుకున్నారు.
ఇప్పుడు అలాంటి సందర్భమే ఈ ఫిల్మీ దంపతులకు ఎదురైంది. మొన్ననే నటగురువు దేవదాస్ కనకాల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడు రాజీవ్ కనకాల .. కోడలు సుమ కనకాల కెరీర్ పరంగా ఊపిరి తీసుకోలేనంత బిజీ. దేవదాస్ గారి మరణానంతరం అంత్యక్రియల్ని పూర్తి చేసి మూడు రోజుల అనంతరం ఆ ఇద్దరూ తిరిగి యథావిధిగా కమిట్ మెంట్లు నెరవేర్చారు. తమవల్ల ఇతరులు ఇబ్బంది పడడం ఇష్టం లేకనే వీళ్లు ఇలా చేయాల్సి వచ్చింది. అప్పటికి అవసరం లేదు అనుకుని లైట్ తీస్కుంటే వారికి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. అయినా ఇచ్చిన మాట ప్రకారం రాజీవ్ తన షూటింగుల్లో పాల్గొంటే .. సుమ మన్మధుడు 2 ప్రమోషన్స్ కి సహకరించారు. ఇలా చాలా అరుదుగా కొందరే చేయగలరేమో!!