Begin typing your search above and press return to search.

నాకేం పర్లేదంటున్న సుమ

By:  Tupaki Desk   |   15 March 2016 12:30 PM IST
నాకేం పర్లేదంటున్న సుమ
X
టాప్‌ యాంకర్‌.. సుమ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతోను, ఆ పేరు గల వ్యక్తితోను పరిచయం అవసరం లేదు. టీవీల్లో రియాల్టీ షోల నుంచి.. సినిమా ఫంక్షన్లలో యాంకరింగ్ వరకూ... ఎనీ ఫంక్షన్ - సింగిల్ హ్యాండ్.. సుమ.. అన్నట్లుగా డీల్ చేసేయడం ఆమె స్పెషాలిటీ. లక్షలాది మంది అభిమానులను సొంత చేసుకున్న సుమ యాంకరింగ్ చేస్తే, ఆ ఫంక్షన్ ఓ ప్రత్యేకత సంతరించుకుంటుందనే టాక్ ఉంది.

అలాంటి సుమ ఆరోగ్యంపై ఇప్పుడు అనేక న్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతోందని.. హైద్రాబాద్ - రాజ్ భవన్ రోడ్ లో ఓ ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ ని సంప్రదించిందని అంటున్నారు. అంతే కాదు.. ఈడాక్టర్ ని సంప్రదించాల్సిందిగా.. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం రిఫర్ చేశారని కూడా చెప్పేస్తున్నారు. దీంతో సుమ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోలన వ్యక్తమైంది. అయితే.. ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. తాను సలక్షణంగా ఉన్నానని సుమ స్వయంగా చెప్పింది. ఈ విషయాన్ని తన సోషల్ పేజ్ లో చెప్పింది ఈ టాప్ మోస్ట్ యాంకర్.

'ఫ్రెండ్స్. నేను బాగానే ఉన్నా. నా ఆరోగ్య పరిస్థితి వచ్చిన సమస్య ఏమీ లేదు. ఎలాంటి రూమర్స్ ని నమ్మకండి' అంటూ పోస్ట్ చేసింది సుమ. దీంతో ఇప్పటివరకూ సుమ హెల్త్ కండిషన్ పై ఉన్న సందేహాలు తొలగిపోయినట్లయింది. ఈ టాప్ యాంకరమ్మ ఫ్యాన్స్ కుదుటపడ్డారు.