Begin typing your search above and press return to search.
సుమ కటింగులు చూశారా??
By: Tupaki Desk | 3 March 2017 3:59 AM GMTతెలుగు టెలివిజన్ కు దక్కిన మలయాళీ వరం.. అని పలువురితో పలు మార్లు పొగిడించేసుకున్న ఎక్స్ పీరియన్స్ యాంకర్ సుమది. టీవీల్లో యాంకరింగ్ అయినా.. సినిమా ఈవెంట్ల హోస్టింగ్ అయినా.. సుమ మాటతీరు అందరినీ కట్టిపడేస్తుంది. అందుకే టాప్ యాంకర్ అయిపోయిన ఈమె.. రీసెంట్ గా విన్నర్ మూవీలో ఐటెం సాంగ్ పాడి సింగర్ అవతారం కూడా ఎత్తేసింది.
ఇప్పుడీమె క్రేజ్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సుమకు.. ఇప్పుడు రిబ్బన్ కటింగ్ పిలుపులు కూడా వస్తున్నాయి. అదేనండీ.. షాపులు.. మాల్స్ ఓపెనింగ్ లు అన్నమాట. తాజాగా హైద్రాబాద్ ఓ స్టూడియో సెలూన్ ప్రారంభం ఈ యాంకర్ చేతుల మీదుగానే జరిగింది. తనదైన చీరకట్టు, స్టైలింగ్ తో చూడముచ్చటగా కనిపించింది సుమ. మరోవైపు.. సుమను చూసేందుకు.. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు ఫాలోయర్స్ తెగ ట్రై చేసేయడం.. పోటీ పడిపోవడం విశేషం.
షాప్ ఓపెనింగ్ మాత్రమే అనుకోవడానికి లేదు. యాంకర్ గా ఉన్న బ్యూటీకి ఇలాంటి అవకాశం రావడం.. క్రేజ్ సంపాదించుకోవడం చాలా అరుదైన విషయం. సుమ ట్యాలెంట్ చూస్తే.. ఈ రేంజ్ ఇంకా పెరిగిపోయినా ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/