Begin typing your search above and press return to search.

ధోని-సుమ.. భలే భలే

By:  Tupaki Desk   |   25 Sept 2016 1:00 PM IST
ధోని-సుమ.. భలే భలే
X
మన సుమ ఎంత మంచి యాంకరో మరోసారి రుజువైంది. తెలుగులో కార్యక్రమాలు నిర్వహించడంలోనే సుమ దిట్ట అని కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఆమె వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది సుమ. ఐతే ఆమె ఇంగ్లిష్ లోనూ అదరగొట్టగలదని.. ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ ను ముందు పెట్టుకుని ఏ తడబాటు లేకుండా చక్కగా యాంకరింగ్ చేయగలదని.. చక్కటి ప్రశ్నలు సంధించగలదని.. నిన్న ‘ఎం.ఎస్.ధోని’ ఆడియో వేడుకలో రుజువైంది.

ధోనిని ముందు పెట్టుకుని ఆమె చాలా ప్రశాంతంగా.. మెచ్యూరిటీతో యాంకరింగ్ చేసింది. ధోనికి మైకు అందిస్తూ.. అతడితో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం పెట్టింది. తెలుగు సినిమాలు చూస్తారా అని.. హైదరాబాద్ గురించి చెప్పమని.. అభిమానులకు ఏదైనా సందేశం ఇవ్వమని అడగడంతో పాటు 2007 ప్రపంచకప్ ప్రస్తావన తీసుకొచ్చి దాని మీద కూడా ప్రశ్నలు వేసింది. ధోని అన్నింటికీ ఓపిగ్గా.. ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ధోని ఏదైనా చిన్న ప్రశ్న వేసినా సుదీర్ఘంగా సమాధానాలు ఇవ్వడం మ్యాచ్ ప్రెజెంటేషన్ల టైంలో చూస్తుంటాం. సుమ అడిగిన ప్రశ్నలకు కూడా అదే విధంగా టకటకా తనదైన శైలిలో జవాబులిచ్చాడు. ఇక రాజమౌళి కూడా చక్కటి ప్రసంగం చేయడంతో ‘ఎం.ఎస్.ధోని’ ఆడియో వేడుక సూపర్ హిట్టయింది.