Begin typing your search above and press return to search.
మా యాంకర్ల పరిస్థితేంటి? -సుమ
By: Tupaki Desk | 15 April 2016 4:04 AM GMTఇప్పుడు ఎటువంటి మెగా వేడుక చూసినా కూడా.. అక్కడ యాంకర్ సుమ ప్రత్యక్షమవ్వడం కాయం. ఒక్క ఇద్దరు ముగ్గురు హీరోలకు ఝాన్సీ యాంకరింగ్ వినిపిస్తుంటే.. తక్కిన బడా స్టార్లందరికీ సుమా ఒక్కత్తే ఒంటి చేత్తో లాగించేస్తోంది. కాని స్పెషల్ గా చెప్పేదేముంది... తన మీద తనే సెటైర్లు వేసుకుంటూ అమ్మడు యాంకరింగ్ అంటే ఇదే అన్నట్లు ఆహుతలను ఉల్లాసోత్సాహాల్లో నింపేస్తూ ఈవెంట్ ను చాలా మ్యాజికల్ గా క్లోజ్ చేస్తుంది.
గత రాత్రి జరిగిన 'సుప్రీమ్' ఆడియో రిలీజ్ లో కూడా సుమ ఏమాత్రం తగ్గలేదు. అక్కడ కూడా ఆవిడ తన మార్కు పంచులు పేల్చింది. హీరో వరుణ్ తేజ్ ఆమెను.. సుమ గారంటే నాకు చాలా ఇష్టం.. నేను ఆవిడ ఫ్యాన్ ను అని చెబితే.. 'బాబూ మీ ఇంట్లో అటక మీదున్న ఏ వస్తువులైనా ఇట్టే తీసేసుకోవచ్చు. నిచ్చెన అక్కర్లేదు. నువ్వున్నావుగా' అంటూ నవ్వించే ప్రయత్నం చేసింది. ఇక రాశి ఖన్నా మాట్లాడుతున్నప్పుడు మాత్రం.. ''నా ప్రక్కన నుంచోకు రాశి.. నీ చెక్కుచెదరని అందం చూస్తే.. నాది మేకప్ అని తెలిసిపోతోంది'' అనడంతో.. అందరూ ఫక్కున నవ్వేశారు.
ఇదే సందర్భంలో రాశి ఖన్నా కూడా తెలుగులో బ్రిలియంట్ గా మాట్లాడుతుంటే.. ''ఎలా రాశి? ఎలా? నువ్వు.. తమన్నా.. మీరందరూ తెలుగులో మాట్లాడేస్తే.. రేపు మా యాంకర్ల పరిస్థితి ఏంటి? మీరే యాంకరింగులు కూడా చేసేస్తారేమో'' అంటూ జోకేసింది సుమ. ఇకపోతే ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నా కూడా.. సినిమాలో మాత్రం డబ్బింగ్ చెప్పలేదని రాశి ఖన్నా చెప్పుకొచ్చిందిలే. ఏదైనా.. సుమ స్టయిలే వేరబ్బా!!