Begin typing your search above and press return to search.

సుమ అమ్మమ్మ.. హండ్రెడ్ ఇయర్స్

By:  Tupaki Desk   |   7 Sept 2016 10:13 AM IST
సుమ అమ్మమ్మ.. హండ్రెడ్ ఇయర్స్
X
దాదాపు ఇరవై ఏళ్లుగా బుల్లితెరపై హల్ చల్ చేస్తున్న సుమ.. ఇప్పుడు టాప్ మోస్ట్ తెలుగు యాంకర్. టీవీ షో అయినా.. ఈవెంట్ అయినా.. ఆమె స్థాయిలో ఎనర్జిటిక్ గా యాంకరింగ్ చేయగల యాంకర్ మరొకరు లేరు. ఔత్సాహిక యాంకర్స్ అందరికీ సుమ ఇన్‌ స్పిరేషన్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇంతగా తాను ఉత్సాహంగా ఉండడానికి కారణం.. తన అమ్మమ్మే అంటోంది సుమ.

రీసెంట్ గా సుమ తన అమ్మమ్మ పుట్టిన రోజు వేడుకలకు.. కేరళ వెళ్లింది. భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంది. సుమ ఫ్యామిలీ ఈ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరపడానికి కారణం.. ఆమెకు ఇది వందో పుట్టిన రోజు కావడమే. కేరళలోనే ఉంటున్న ఆమె పేరు పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రిమ్మ. అమ్మమ్మ వందో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం మరిచిపోలేనని.. ఈ రోజును ఎంతో ఆనందంగా గడుపుతున్నానని సుమ అంటోంది. చిరునవ్వు.. కల్మషం లేని మనసు.. ప్రెజర్ లేని లైఫ్.. అందరూ బాగుండాలని కోరుకోవడం.. ఇదే ఆవిడ నిండు నూరేళ్లు జీవించడానికి కారణం అంటున్న సుమ.. ఆమె అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నట్లు చెబుతోంది.

అమ్మమ్మతో గడిపిన కొన్ని క్షణాలను అభిమానులతో కూడా సుమ పంచుకుంది. ఆ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆమె దోశ వేస్తుంటే.. పక్క నుంచి చూసి ఎంజాయ్ చేయడమే కాదు..'అమ్మమ్మ హండ్రెడ్ ఇయర్స్.. దోశ వేస్తోంది' అంటూ చెప్పేస్తోంది. అక్కడకెళ్లి కూడా అమ్మమ్మకి యాంకరింగ్ చేసేసింది సుమ.