Begin typing your search above and press return to search.
మాంద్యలో రెబల్ స్టార్ అంబరీష్ కి ఆలయం.. సుమలత ఎమోషన్
By: Tupaki Desk | 25 Nov 2020 9:10 AM GMTశాండల్ వుడ్ రెబెల్ స్టార్ అంబరీష్ రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి.. ప్రముఖ నటి సుమలత తన దివంగత భర్తకు నివాళులర్పించారు. సుమలత కుమారుడు అభిషేక్ .. దర్శన్ లతో కలిసి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించగా.. పరిశ్రమ ప్రముఖులు హృదయపూర్వక నివాళి అర్పించారు. కథానాయకుడు దొడ్డన్న.. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సహా.. ఎమ్మెల్యే కె గోపాలయ్య నివాళులర్పించారు.
ఇక మీడియాతో మాట్లాడుతూ సుమలత ఎంతో ఎమోషనల్ అవ్వడం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ``నా ప్రియమైన అంబి అప్పాజీ కన్నుమూసి రెండేళ్ళు అయ్యింది. కాని ఆయన ఎప్పటికీ మన హృదయాల్లోనే ఉన్నారు. ఆయన సూటియైన వ్యక్తిత్వం.. ఆయన దయార్ద్ర హృదయం కన్నడిగుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ఇప్పటి నేను నేను కాదు! అంటూ సుమలత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ``కళ్లు మూసి ఉంచగలను. చెవులను కూడా మూయగలను. కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే ఒక అనంతమైన ప్రేమ.. ఒక అపూర్వమైన శక్తి.. ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం అది`` అంటూ పోయెటిక్ గా ఎమోషన్ కి గురవ్వడం చర్చకొచ్చింది.
సుమలత సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో వైరల్ గా మారింది.
రెబెల్ స్టార్ ని తన స్నేహితులు పరిశ్రమకు చెందిన సహచరులు మాత్రమే కాకుండా అభిమానులు ఎప్పటికీ ఇలానే గుర్తుంచుకుంటారు. అందుకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు అని తెలిపారు.

దివంగత నటుడు అంబరీష్ కోసం ఆలయం నిర్మించడానికి ఇటీవల మాంద్య గ్రామస్తులు రూ .8 లక్షలు నిధిని సేకరించారు. నటుడి రెండవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులు మాంద్యా జిల్లా సమీపంలోని హాటెన్ గౌడనా దోడి పరిసరాల్లో ఆలయాన్ని నిర్మించారు.