Begin typing your search above and press return to search.
వాళ్లప్పుడెలా ఉన్నారంటే..
By: Tupaki Desk | 19 Sep 2017 4:58 AM GMTస్వతహాగా తెలుగింటి ఆడపడుచే అయినా కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకుని కన్నడ సీమలో సెటిలయిపోయిన నటి సుమలత. ఒకప్పుడు తెలుగు టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమలత మెగా స్టార్ చిరంజీవితో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాల నుంచి తప్పుకొంది. తర్వాత మళ్లీ రాజకుమారుడు సినిమా నుంచి తెలుగులో నటించడం ప్రారంభించింది. అప్పుడప్పుడు సెలక్టివ్ గా కొన్ని పాత్రల్లో తెలుగు తెరపై కనిపిస్తూనే ఉంది.
తాజాగా సుమలత తన పుట్టిన రోజునాటి ఫొటోలను షేర్ చేసింది. అయితే అవి ఇప్పటి పుట్టినరోజు ఫొటోలు కాదు. 80లలో చేసుకున్న ఫంక్షన్ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో్ ఉంచింది. ఈ ఫొటోల్లో నాటి తెలుగు - కన్నడ చిత్రసీమల్లోని ముఖ్యమైన నటీనటులంతా ఉన్నారు. బాలకృష్ణ - చిరంజీవి - జయసుధ వంటి వారంతా మంచి జోరుమీదున్న టైమది. ఎలాంటి మేకప్ లేకపోయినా ఎంత గ్లామర్ గా ఉండేవారో ఈ ఫొటోలను చూస్తే తెలిసిపోతుంది. కన్నడ ఇండస్ట్రీలో విష్ణువర్ధన్ - భారతి - సుమలత భర్త అంబరీష్ కూడా ఆ ఫంక్షన్ కు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు.
రెండు చిత్రసీమలకు చెందిన ఆనాటి మేటి తారాగణాన్ని చూసిన నాటి తరం వాళ్లకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడం ఖాయం. వీరిలో విష్ణువర్ధన్ - భారతి మినహా మిగతా వారంతా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను మెప్పిస్తూ నటన కొనసాగించడమంటే గొప్పే కదా..