Begin typing your search above and press return to search.

నాగ్ కోసం పెద్దాయన చూసిన పెళ్లి కూతురు

By:  Tupaki Desk   |   19 July 2016 10:30 PM GMT
నాగ్ కోసం పెద్దాయన చూసిన పెళ్లి కూతురు
X
టాలీవుడ్ దిగ్గజాల్లో మొదటగా వినిపించే రెండు పేర్లలో.. పెద్దాయన అక్కినేని నాగేశ్వరరావు మాంచి ఛమత్కారి మరియు సింపుల్ జెంటిల్మన్ కూడా. తాను రొమాంటిక్ సినిమాలు చేసిన మహత్యమో ఏమో చెప్పలేం కానీ.. హీరోయిన్స్ పై జోకులు వేయడం ఆయన విరివిగా చేసేవారు.

అలాంటి ఏఎన్నార్.. తన కుమారుడు హీరో కాకముందే ఓ హీరోయిన్ ని కోడలిగా అనుకున్నారట. మాజీ హీరోయిన్ సుమలత ఒక నాటి కబుర్లను ఈనాటి ఆడియన్స్ తో పంచుకుంది. ''ఓసారి నాగేశ్వరరావు గారు నన్ను పెళ్లి గురించి అసలు ఉద్దేశ్యం ఏంటి అని అడిగారు. ఓ అమెరికా రిటర్న్ అబ్బాయిని చేసుకుంటావా అన్నారు ఆయన.. అవసరమైతే మా అమ్మతో కూడా మాట్లాడతానన్నారు. మా అమ్మతో కూడా మాట్లాడాను నేను. తరువాత ఆయన్ను ఇంతకీ ఎవరు సార్‌ ఆ అబ్బాయి అంటే.. తన చిన్న కొడుకు నాగార్జున కోసమే అలా అడిగానని చెప్పారు'' అని చెప్పింది సుమలత. అంటే నాగార్జున ఇంకా సినిమాల్లో నటించడం ప్రారంబించకముందే ఈ విషయం చోటుచేసుకందనమాట.

ఇదంతా బాగానే ఉంది కాని.. మరి ఏఎన్నార్ ప్రపోజల్ కి తానిచ్చిన జవాబు ఏంటో మాత్రం సుమలత చెప్పలేదు. ఈ లెక్కన ఏఎన్నార్ తన కోడలిగా ఓ హీరోయిన్ అయిన సుమలతను ఎంచుకుంటే.. తర్వాతి కాలంలో మరో హీరోయిన్ అమలను నాగార్జున ఎంచుకున్నాడు. అది సంగతి.