Begin typing your search above and press return to search.

`మా` వివాదంలో మెగాస్టార్ కే బాస‌ట‌

By:  Tupaki Desk   |   18 Jan 2020 1:20 PM GMT
`మా` వివాదంలో మెగాస్టార్ కే బాస‌ట‌
X
`మా` డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో జ‌రిగిన ర‌సాభాస గురించి తెలిసిందే. స‌భ‌కు మ‌ర్యాద ఇవ్వ‌కుండా...పెద్ద‌లంటే గౌర‌వమ‌ర్యాద‌ లేకుండా వ్య‌వరించిన యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ తీరుపై పెద్ద‌లంతా అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. డైరీ ఆవిష్క‌ర‌ణ‌ వేదిక‌పై పెద్ద‌లంద‌రి కాళ్ల‌కి న‌మ‌స్క‌రించ‌డం... వివాదాలు ఉన్నాయ‌ని మీడియా ముందు ఓపెన్ అవ్వ‌డం.. మంచి ప‌నులు చేస్తుంటే తొక్కేస్తున్నార‌ని బ‌య‌ట‌ప‌డిపోవ‌డం.. ఇలా ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు చేసి రాజ‌శేఖ‌ర్ మీడియాలో హైలైట్ అయ్యారు.

రాజ‌శేఖ‌ర్ వ్య‌వ‌హారానికి కౌంట‌ర్ గా మెగాస్టార్ చిరంజీవి అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని `మా` క‌మిటీని కోర‌డం.. వెంట‌నే రాజ‌శేఖర్ `మా` ఉపాధ్య‌క్షుడి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం అంతా వేగంగా జ‌రిగిపోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. అయితే త‌ప్పంతా రాజ‌శేఖ‌ర్ దే అన్న‌ట్లు త‌ర్వాత చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చిరును త‌ప్పుబ‌ట్టే ప్ర‌య‌త్నం చేసినా ప‌లువురు మెగాస్టార్ కే మ‌ద్ధ‌తు ప‌లికారు. కృష్ణం రాజు- మోహ‌న్ బాబు వంటి పెద్ద‌లు మెగాస్టార్ అభిప్రాయానికే గౌర‌వం ఇచ్చారు. తాజాగా మా వివాదంపై వెట‌ర‌న్ యాక్ట‌ర్ సుమ‌న్ స్పందించారు. శ‌నివారం తిరుమ‌ల వెంక‌టేశుని ద‌ర్శ‌నం అనంత‌రం అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

రాజ‌శేఖ‌ర్ చేసింది ముమ్మాటికి త‌ప్పు. మంచి ఉంటే మైక్ లో చెబుదాం.. చెడు అయితే చెవిలో చెప్పుకోవాల‌న్న చిరంజీవి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించారు. `మా `లో స‌మ‌స్య‌ల‌ని అంత‌ర్గతంగా చ‌ర్చించుకుని ఉంటే స‌రిపోయేది. మీడియా ముందుకెళితే ప‌రువు మంట క‌లిసిన‌ట్టే క‌దా! అన్న‌ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అనుకోకుండా రాజ‌శేఖ‌ర్ ఆవేశ ప‌డ్డారు. ఆయ‌న త‌ప్పు కూడా లేదు. కొన్ని స‌మ‌స్య‌లు ఉండి అవి ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాక‌పోయేస‌రికి అలా స్పందించారు. భ‌విష్య‌త్ లో ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని సూచించారు.