Begin typing your search above and press return to search.

నేను జైలుకు వెళ్ళడానికి కారణం అతడే...!

By:  Tupaki Desk   |   19 July 2020 4:30 PM GMT
నేను జైలుకు వెళ్ళడానికి కారణం అతడే...!
X
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి సినిమాల్లో దేవుడు పాత్రలు ఉంటే మొదటగా గుర్తొచ్చేది హీరో సుమన్ అని చెప్పవచ్చు. 'అన్నమయ్య' 'శ్రీరామదాసు' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో దక్షిణ చిత్ర పరిశ్రమలో అందగాడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుమన్‌ అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లకు పోటీగా నిలిచాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ లో కూడా ప్రావీణ్యం ఉండటంతో పాటు హీరోకి ఉండాల్సిన పర్సనాలిటీ వుండటంతో సుమన్‌ స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్‌ బ్లూ ఫిలింస్‌ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లటంతో అతని కెరీర్‌ ఒక్కసారిగా తారుమారైంది. అయితే ఈ వివాదంలో తెర వెనుక ఓ స్టార్ హీరో హస్తం వున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపించింది. సుమన్‌ తనకు పోటీ వస్తాడన్న స్వార్థంతో ఆ హీరోయే ఇదంతా చేయించాడని గాసిప్స్ క్రియేట్ చేసారు. అయితే జైలు నుంచి బయటకి వచ్చిన సుమన్ పలు ఇంటర్వ్యూలలో దీనిపై స్పందిస్తూ నన్ను ఆ కేసులో ఇరికించడం వెనుక ఏ హీరో హ్యాండ్ లేదని.. అవన్నీ రూమర్స్‌ అని కొట్టి పారేశారు.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఇదే అంశంపై మాట్లాడిన సుమన్.. నన్ను ఈ కేసులలో ఇరికించిన వ్యక్తి ఒకప్పటి నా స్నేహితుడు దివాకర్ అని.. అతనికీ టాలీవుడ్ కూ ఏ సంబంధం లేదని.. అయితే ఈ వివాదంలోకి సినీ ప్రముఖుల పేర్లను మీడియా వాళ్ళు కావాలనే ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జైలుకు వెళ్తానన్న విషయం తనకు ముందే తెలుసని.. ఈ కేసులో తన ఫ్రెండ్ భాను చందర్‌ ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని అతన్ని కాపాడానని.. ఆ సమయంలో తనను కలవొద్దని ఫోన్‌ కూడా చేయొద్దని భానుచందర్‌ తో చెప్పానని.. నేను హీరోగా పేరు తెచ్చుకుంటానని నమ్మిన ఏకైక వ్యక్తి భాను చందరేనని తెలిపారు సుమన్. ''అయినా ఆ రోజు జరిగిన వివాదాలకు పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే అని అప్పట్లోనే చెప్పాను.. అతనికి సంబంధించిన విషయాలేవి నేను దాయలేదు.. కానీ మీడియా మాత్రం కొంత మంది హీరోల పేర్లు తెర మీదకు తీసుకువచ్చింది. ఆ రోజు జరిగిన దానితో ఏ హీరోకు సంబంధం లేదు అని వెల్లడించారు. ఇక నాపై గూండా యాక్ట్‌ పెట్టడంతో అంతకు ముందు ఇలాంటి కేసులు రిఫరెన్స్‌ లేకపోవటంతో అన్ని విషయాలు చర్చించి క్లీన్‌ చీట్‌ రావాడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఆ ఆరోపణలు అబద్ధాలేనని తేలిపోయింది'' అంటూ చెప్పుకొచ్చారు సుమన్‌.