Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్స్ కు సుమన్ కౌంటర్
By: Tupaki Desk | 24 Nov 2018 4:47 PM GMTహీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించి అప్పట్లో స్టార్ హీరోలకు పోటీగా నిలిచిన సుమన్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తూ వస్తున్న సుమన్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పడంతో పాటు - స్టార్ డైరెక్టర్స్ పై సున్నితంగా విమర్శలు చేశాడు.
తన దృష్టిలో పెద్ద దర్శకులు - గొప్ప దర్శకులు అని రెండు రకాల దర్శకులు ఉంటారని - పెద్ద హీరోలతో - పెద్ద బడ్జెట్ తో సినిమాలు చేసినంత మాత్రాన గొప్ప దర్శకుడు కాలేరని - చిన్న వారితో - కొత్త వారితో సినిమాలు చేసి సక్సెస్ లను దక్కించుకున్న వారిని తాను గొప్ప దర్శకులుగా భావిస్తానన్నాడు. స్టార్ హీరోలతో ఏ దర్శకుడు సినిమా చేసినా కూడా మినిమం సక్సెస్ అవుతుంది. కాని కొత్త వారితో సినిమాలు చేసి అందరు కలెక్షన్స్ రాబట్టలేరు. తెలుగులో కేవలం శేఖర్ కమ్ముల మాత్రమే అలా చేయగలడని - అందుకే తన దృష్టిలో శేఖర్ కమ్ముల గొప్ప దర్శకుడని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ డైరెక్టర్ తో సినిమాలు చేసిన సుమన్ షాకింగ్ గా శేఖర్ కమ్ములను పొగడ్తలతో ముంచెత్తడం కాస్త షాకింగ్ విషయమేనని చెప్పుకోవాలి.
ఇక నిర్మాతల్లో రామానాయుడు చాలా గొప్ప నిర్మాత. ఆయన తీసిన సినిమాలు ఇప్పటి నిర్మాతలు తీయలేరు. ఆయన సినిమాపై చాలా శ్రద్ద పెట్టి మరీ నిర్మించే వారు. కాని ప్రస్తుత నిర్మాతలు మాత్రం నిర్మించిన సినిమాలను విడుదల కూడా చేసుకోలేని పరిస్థితి ఉందని సుమన్ అన్నాడు. ఇక డాన్స్ ల విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అంటూ సుమన్ కితాబిచ్చాడు. కిందకు చూడకుండా డాన్స్ చేయగల సత్తా కేవలం చిరంజీవికి మాత్రమే ఉందని, ఆయన ఒక గొప్ప డాన్సర్ అన్నాడు. ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ బాగా చేస్తాడని సుమన్ అన్నాడు.