Begin typing your search above and press return to search.
జగన్ కలిసేందుకు..ఈ హీరో విశ్వ ప్రయత్నం చేశారట!
By: Tupaki Desk | 26 Jan 2020 2:38 PM GMTఏపీలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. ఓ వైపు రాష్ట్రానికి మూడు రాజదానులను ఏర్పాటు చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా సాగుతుంటే.. జగన్ యత్నాలను అడ్డుకోవడంతో పాటుగా రాజధానిని అమరావతిలోనే కొనసాగేలా టీడీపీ తనదైన శైలి వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో జగన్ చాలా బిజీగానే ఉన్నట్లు లెక్క. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ నటుడు, గతంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన నటుడు సుమన్ విశ్వప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే ఏకంగా జగన్ కలిసేందుకు ఐదు సార్లు యత్నించినా కూడా తనకు జగన్ అపాయింట్ మెంట్ లభించలేదని శనివారం నాడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయినా ఇప్పుడు జగన్ ను కలిసేందుకు సుమన్ ఎందుకు యత్నిస్తున్నారన్న విషయం కూడా ఆసక్తి రేకెత్తించేదే. అదేంటంటే... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రాజధాని రైతులు నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు కదా. రాజధాని రైతులకు మద్దతుగా తాను కూడా ఉద్యమంలోకి దిగుతానని, అయితే తన అవసరం ఉందన్న విషయాన్ని రాజధాని రైతులే చెప్పాలని కూడా సుమన్ ఓ వింత కండీషన్ పెట్టారు. రాజధాని రైతులు కోరితే... తాను వారికి మద్దతుగా ఆందోళనల్లో పాలుపంచుకుంటానని సుమన్ చెబుతున్నారు. అంతేకాకుండా రాజధాని రైతులు కోరితే సినీ పరిశ్రమ నుంచి మరికొందరు కూడా ఆందోళనలకు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా సుమన్ చెప్పుకొచ్చారు.
శనివారం గుంటూరు జిల్లా మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాలుపంచుకునేందుకు వచ్చిన సందర్బంగా సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై అసలు జగన్ ఉద్దశ్యమేమిటో తనకు అర్థం కావడం లేదని చెప్పిన సుమన్... జగన్ ను కలవడానికి ఏకంగా తాను ఐదు సార్లు యత్నించానని చెప్పారు. అయితే ఐదు సార్లు అపాయింట్ మెంట్ అడిగినా... జగన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సుమన్ చెప్పుకొచ్చారు. జగన్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెబుతున్న సుమన్... అసలు తాను ఎందుకు, ఏ కారణంతో, ఏ పని మీద జగన్ ను కలవానుకుంటున్న విషయాన్ని మాత్రం చెప్పకపోెవడం గమనార్హం.