Begin typing your search above and press return to search.

ఓ ఇంటివాడు కాబోతున్న సుమంత్.. అమ్మాయి ఎవరంటే..?

By:  Tupaki Desk   |   2 Feb 2021 1:48 PM GMT
ఓ ఇంటివాడు కాబోతున్న సుమంత్.. అమ్మాయి ఎవరంటే..?
X
ప్ర‌ముఖ నిర్మాత-దర్శకుడు ఎంఎస్ రాజు ఇంట పెళ్లి బాజా మోగ‌నుంది. ఆయ‌న‌ కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తెలుగువారి ఆచార సంప్ర‌దాయాల ప్ర‌కారం ఈ వేడుక‌ను నిర్వ‌హించేందుకు ఎంఎస్ రాజు సిద్ధ‌మ‌వుతున్నారు.

అయితే.. కొవిడ్ భ‌యం ఇంకా పూర్తిగా తొల‌గక‌పోవ‌డంతో.. పెళ్లితంతును సాధార‌ణంగా నిర్వ‌హించాల‌ని రాజు కుటుంబం నిర్ణ‌యించుకుంది. హైదరాబాద్‌లోనే జరగనున్న ఈ వివాహ వేడుక‌కు.. కేవ‌లం కుటుంబ సభ్యులు, అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉండే ఆత్మీయుల‌ను మాత్రమే ఆహ్వానించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు ఎంఎస్‌. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు.

‘‘మన ప్రియమైన వారిని కలవడం కన్నా గొప్ప ఆనందం ఏముంటుంది? కానీ.. ఈ అసాధారణ సమయం మనల్ని కలుసుకోనివ్వట్లేదు. మీరు దూరంగా ఉన్నప్పటికీ.. నూతన దంపతులకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు అందుతాయని ఆశిస్తున్నాం’’ అంటూ ఎంఎస్ రాజు, ఆయన సతీమణి సుధా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా.. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన ‘డర్టీ హరి’ మూవీ ఇటీవలే విడుదలై.. స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం.. మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో రాజు ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు కుమారుడి వివాహం కూడా జరగబోతుండడంతో.. ఎంజాయ్ మెంట్ డబుల్ డోస్ లో కంటిన్యూ అవుతోంది. ఇక, కొడుకు పేరు మీద ‘సుమంత్ ఆర్ట్స్’ బ్యానర్ ను స్థాపించిన రాజు.. ఒక్కడు, వర్షం, నువొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

ఇక, సుమంత్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి, పలు సినిమాలు చేశాడు. తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘తూనీగ.. తూనీ’తో మొదలైన సుమంత్ అశ్విన్.. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘అంతకు ముందు.. ఆ తర్వాత’ చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత లవర్స్, కేరింత, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్.. అంటూ పలు చిత్రాలతో అలరించిన సుమంత్ అశ్విన్.. దీపిక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి ముహూర్తం తదితర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.