Begin typing your search above and press return to search.

25వ సినిమాతో ఫేట్ మారుతుందా??

By:  Tupaki Desk   |   15 March 2018 9:52 AM GMT
25వ సినిమాతో ఫేట్ మారుతుందా??
X
గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో సుమంత్ కూడా ఉన్నాడు. మామ అక్కినేని నాగార్జున తరహాలోనే డిఫెరెంట్ సినిమాలను బాగానే ట్రై చేశాడు. యాక్షన్ - లవ్ అంటూ కొత్త కాన్సెప్ట్ లను ఎంచుకోవడంలో బాగానే క్రేజ్ తెచ్చుకున్నాడు. కాని కమర్షియల్ హిట్ మాత్రం ఇంత వరకు అందుకోలేదు. సుమంత్ ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేశాడు అనుకుంటున్న సమయంలో మళ్లీ రావా అనే సినిమాతో వచ్చాడు.

ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. కానీ కమర్షియల్ గా మాత్రం సినిమాకు అనుకున్నంత క్రేజ్ అందలేదు. ఇప్పటివరకు సుమంత్ 24సినిమాలు చేశాడు. అయితే 25వ సినిమాతో ఎలాగైనా అన్ని వర్గాల వారిని సరికొత్తగా మెప్పించి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ ఉగాదికి సినిమా స్టార్ట్ కానుంది. సంతోష్ జాగర్లపూడి అనే యువకుడు సుమంత్ ల్యాండ్ మార్క్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు.

ఈ నెల 18న అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం 8 గంటల 45 నిమిషాలకు సినిమా ప్రారంబ ముహుర్తాన్ని సెట్ చేశారు. ఇక ఈషా రెబ్బ హీరోయిన్ నటిస్తోన్న ఈ సినిమాని ధీరజ్ బొగ్గారం & బీరం సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబందించిన టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయినా సుమంత్ కమర్షియల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.