Begin typing your search above and press return to search.

కోర్టుకొచ్చిన అక్కినేని వారి కజిన్స్

By:  Tupaki Desk   |   3 May 2018 5:30 PM GMT
కోర్టుకొచ్చిన అక్కినేని వారి కజిన్స్
X

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. పవన్ తో కలిసి ఫిలిం ఎంట్రీ ఇచ్చిన నాగ మేనకోడలు సుప్రియ.. మేనల్లుడు సుమంత్ వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రియ తెరపై కనిపించకపోయినా.. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున కీలకమైన విధులనే నిర్వహిస్తోంది.

అయితే.. ఏడాదిన్నర క్రితం సుమంత్ హీరోగా నరుడా డోనరుడా అంటూ ఓ సినిమా వచ్చింది. హిందీ హిట్ మూవీ విక్కీ డోనర్ ను మంచి రేటే ఇచ్చి.. తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాకు జాన్ సుధీర్ పూదోటతో పాటు.. యార్లగడ్డ సుప్రియ కూడా ఓ నిర్మాత. ఆ సినిమా ఫెయిల్ కావడంతో.. చాలానే కష్టాలు వెంటాడాయి. ఇప్పుడు సడెన్ గా వీరిద్దరూ ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టులో కనిపించారు. చాలా సింపుల్ గా.. ఎలాంటి హడావిడి లేకుండా కోర్టుకు వచ్చారు. ఎలాంటి షూటింగ్ వాతావరణం కనిపించకపోవడంతో.. పలువురికి అనుమానం వచ్చి వీరికి కోర్టు దగ్గర ఏం పనా అని ఆరా తీశారు.

నరుడా డోనరుడా సినిమా సమయంలో ఓ ఫైనాన్షియర్ కు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో.. కేసు వేశారని.. ఆ కేసుకు సంబంధించిన విచారణకు హాజరయ్యామని చెప్పారు ఈ బ్రదర్ అండ్ సిస్టర్. అక్కినేని అండ్ దగ్గుబాటి లాంటి ఫ్యామిలీస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. వాళ్లకు వారసులు.. పైగా వీళ్లది కూడా పెద్ద కుటుంబమే అయినా.. ఓ చెక్కు ఎన్ని చిక్కులు తెచ్చిందో చూశారా? అందుకే చెక్కుల విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి మరి.