Begin typing your search above and press return to search.
కాలకేయుడితో కుర్ర హీరో స్నేహం
By: Tupaki Desk | 8 Jun 2016 5:08 AM GMTఈ శుక్రవారం విడుదల కాబోతున్న రైట్ రైట్ చిత్రానికి ట్రైలర్స్ టీవీల్లో దర్శనమిస్తున్నాయి. వీటిలో సుమంత్ అశ్విన్, ప్రభాకర్ ల జంట సందడి చేస్తోంది. వీరిద్దరూ కలిసి చేసే కామెడీ సన్నివేశాలతో పాటు.. కొన్ని సీరియస్ సీన్లు కూడా ట్రైలర్లలో కనిపిస్తున్నాయి. ఒకరేమో బక్కపలచని కుర్ర హీరో - ఇంకొకరేమో భారీ విగ్రహంతో నిండుగా కనిపించే కాలకేయుడు ప్రభాకర్. ఈ ఇద్దరిని కలిపి చూపించాలనే దర్శకుడి ఆలోచన ఏ రేంజ్ లో పండబోతోందో.. ఇప్పటికి ట్రైలర్ మాత్రమే చూపించారు.
'సుమంత్ ని మొదటిసారి కలిసినప్పుడు హాయ్ భయ్యా! అంటూ పలకరించాను. తను సైలెంట్ గా ఉన్నాడంతే' అన్నాడు ప్రభాకర్. వెంటనే దీనిపై వివరణ ఇచ్చేశాడు కుర్ర హీరో. 'సెట్స్ పై ఉన్నపుడు నేను వర్క్ మోడ్ లోనే ఉంటాను. పెద్దగా ఎవరితో కలవను. నా ప్రవర్తన బాగాలేదంటూ హీరోయిన్స్ కూడా డైరెక్టర్లకు కంప్లెయింట్ చేస్తుంటారు. నేను ఒకసారి ఆ జోన్ నుంచి బయటకొస్తే మాత్రం విపరీతంగా కలిసిపోతాను' అని చెప్పాడు సుమంత్ అశ్విన్.
'ఓ కామెడీ సీన్ కోసం.. రైట్ రైట్ యూనిట్ అంతా మమ్మల్ని మాత్రమే వదిలేసి దూరంగా వెళ్లిపోయింది. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవడం తప్ప వేరే ఛాయిస్ లేదు. అలా మా ఇద్దరి మధ్య అడ్డంకి ఏదైనా ఉంటే అప్పుడు బ్రేక్ అయింది. ఇలాగ ఇద్దరం ఒకే తరహా ఫీలింగ్స్ ను ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువగా పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. అలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం' అంటున్నడు సుమంత్ అశ్విన్. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తోంది రైట్ రైట్.