Begin typing your search above and press return to search.

కోడిగుడ్ల ఎటాక్‌పై హీరో వివరణ

By:  Tupaki Desk   |   30 Jun 2015 7:42 AM GMT
కోడిగుడ్ల ఎటాక్‌పై హీరో వివరణ
X
కేరింత హిట్టయ్యింది. సుమంత్‌ అశ్విన్‌కి పేరొచ్చింది. అంతేకాదండోయ్‌ .. ఈ చిత్రంలో శ్రీకాకుళం యాసను వెక్కిరింతగా ఉపయోగించినందుకు ఏకంగా కోడిగుడ్ల బహుమానం కూడా అందుకుంది టీమ్‌. విజయనగరం, శ్రీకాకుళం పరిసరాల్లో సక్సెస్‌ టూర్‌కి వెళ్లినప్పుడు కొందరు స్థానికులు కేరింత టీమ్‌ని తీవ్రంగా ప్రతిఘటించారు. శ్రీకాకుళం యాసను ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసేస్తారా? మా భాషను వెక్కిరిస్తారా అంటూ కోడిగుడ్లు విసిరికొట్టారు.

దీనికి వివరణ ఇస్తూ .. సుమంత్‌ అశ్విన్‌ ఏమన్నాడంటే.. ఇదంతా కావాలని చేసింది కాదు. ఒక ప్రాంతం యాస, భాష వేటినీ కావాలని సినిమాల్లో చూపించరు. ఆ క్యారెక్టర్‌ శ్రీకాకుళం నుంచి వచ్చినది కాబట్టి ఆ భాష మాట్లాడాల్సొచ్చింది. అయినా ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జరగాల్సిన డ్యామేజీ ఇప్పటికే జరిగిపోయింది. శ్రీకాకుళం బాబులు బాగా హర్టయ్యారు. అయితే సినిమాటిక్‌ లిబర్టీస్‌, వినోదం కోసం పాకులాటలో మాత్రమే ఇదంతా. దీన్ని ప్రేక్షక జనం కూడా అర్థం చేసుకుంటేనే మంచిది.

అలాగే ఒక ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని టచ్‌ చేసేప్పుడు ఫిలింమేకర్స్‌ సైతం జాగ్రత్తగా ఉండాలి. సున్నిత ఉద్వేగాల్ని టచ్‌ చేస్తే అంతే సంగతి అని శ్రీకాకుళం ఉదంతం నేర్పించింది.