Begin typing your search above and press return to search.
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్నసుమంత్ సినిమా
By: Tupaki Desk | 15 Jan 2022 1:53 PM GMTకరోనా, ఒమిక్రాన్ ప్రకంపణలు మొదలు కావడం, థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో సినిమాలకు మళ్లీ గడ్డు కాలం మొదలైంది. థియేటర్లలో సందడి చేయాలనుకున్న చాలా వరకు పెద్ద చిత్రాలు రిలీజ్ లని వాయిదా వేసుకుంటుంటే మరి కొన్ని చిత్రాలే చేసేది లేక ఓటీటీకి జై కొట్టేస్తున్నాయి. చాలా వరకు చిన్న చిత్రాలు ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ నటించిన సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.
సుమంత్ నటించిన తాజా చిత్రం `మళ్లీ మొదలైంది. నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది. పెళ్లి, విడాకులు, మళ్లీ పెళ్లీ వంటి అంశాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఈమూవీతో కీర్తి కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో మరో నెల రోజుల్లో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు విశేష సంపందన లభించింది. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో సుహాసిని, పోసాని కృష్ణ మురళి, మంజుల, వర్షిణి సౌందర్ రాజన్, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్ నటించారు.
విడాకులు తీసుకున్న వాళ్ల కోసం లాయర్ అయిన హీరోయిన్ రీసెట్ అనే కంపనీని స్టార్ట్ చేస్తుంది. అదే కంపనీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో తనతో ఎలా మింగిల్ అయ్యాడు? .. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడింది.. అది మళ్లీ పెళ్లికి దారి తీసిందా? .. తీస్తే ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ మూవీని దర్శకుడు కీర్తి కుమార్ తెరకెక్కించారు.
`మళ్లీ రావా`తో ట్రాక్ లోకి వచ్చేసిన సుమంత్ ఈ మూవీ తరువాత మళ్లీ సక్సెస్ అందుకోవడానికి సతమతమవుతున్నారు. సుబ్రమణ్య పురం, ఇదమ్ జగత్, కపటధారి వంటి చిత్రాలతో సక్సెస్ కోసం ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు `మళ్లీ మొదలైంది` అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదేనా ఆయనకు మళ్లీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.