Begin typing your search above and press return to search.
ఇష్టం వచ్చింది రాసుకోండి అంటున్న హీరో
By: Tupaki Desk | 1 Dec 2018 5:40 AM GMTఅక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు లేకపోయినా డీసెంట్ హిట్స్ ఉన్నాయి. తన చివరి చిత్రం 'మళ్ళీ రావా' తో ప్రేక్షకులను మెప్పించిన సుమంత్ తాజాగా 'సుబ్రహ్మణ్యపురం' సినిమాతో మరోసారి మనముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా సుమంత్ సోషల్ మీడియా నెగెటివిటీ మీద స్పందించాడు. సుమంత్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. తన సినిమాల ప్రమోషన్ విషయంలో ఎక్కువగా వాడుతూ పర్సనల్ విషయాల్లో చాలా తక్కువగా వాడతాడు. సోషల్ మీడియలో చాలామంది వ్యక్తులు బాధ్యతా లేకుండా ప్రవరిస్తారని అందుకే 70% ప్రొఫెషన్ కు సంబంధించిన విషయాలు.. 30% పర్సనల్ విషయాలు పోస్ట్ చేస్తానని తెలిపాడు. తన పోస్టులపై వచ్చే నెగెటివిటీ.. రూమర్లను పట్టించుకోనన్నాడు. అసలు పాజిటివ్ అయినా.. నెగెటివ్ అయినా కామెంట్స్.. రిప్లైలు చదవనన్నాడు. ఫేక్ అకౌంట్స్ కారణంగా సోషల్ మీడియాలో ఇతరులను తిట్టడం.. వేధించడం సాధారణం అయ్యాయని అభిప్రాయపడ్డాడు. "ఇష్టం వచ్చింది రాసుకోండి .. ఐ డోంట్ కేర్" అంటున్నాడు.
తన ప్రొఫెషన్ కారణంగా సోషల్ మీడియాలో సినిమాలను ప్రమోషన్ చేయక తప్పదని అంగీకరించాడు. ఏదేమైనా సుమంత్ చెప్పే విషయాలలో నిజం ఉంది కదా. మహేష్ బాబు.. రాజమౌళిలాంటి వారికే సోషల్ మీడియా లో అప్పుడప్పుడూ గట్టిగా హీట్ తగులుతూ ఉంటుంది. మరి మిగతా సెలబ్రిటీల పరిస్థితి అందుకు భిన్నంగా ఎలా ఉంటుంది?