Begin typing your search above and press return to search.

డోనరుడు.. జస్ట్ 1 క్రోర్ అంతే!!

By:  Tupaki Desk   |   3 Nov 2016 5:00 AM GMT
డోనరుడు.. జస్ట్ 1 క్రోర్ అంతే!!
X
ఓ సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేయాలంటే ఎంత కావాలి? అని ఫిలిం ఇండస్ట్రీలో ఎవరిని ప్రశ్నించినా వచ్చే ఆన్సర్.. ఓ కోటి ఉండాలి కదా అనేస్తారు. కానీ ఈ బడ్జెట్ తో ఓ సినిమా తీసేయచ్చని నిరూపించారు క్షణం మూవీ టీం. అంత తక్కువతో తీసి.. ఇంకొంత పబ్లిసిటీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశారు.

రీసెంట్ గా పెద్ద సక్సెస్ సాధించిన చిన్న సినిమా పెళ్లి చూపులు పరిస్థితి కూడా ఇంతే. కేవలం 60-70లక్షలు మాత్రమే ఖర్చయింది. ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అయిపోతూ.. కేవలం కోటి రూపాయల్లోనే నరుడా డోనరుడా చిత్రాన్ని పూర్తి చేసేశాడట సుమంత్. నిర్మాతలు తన వాళ్లే కావడంతో.. అసలు సుమంత్ పైసా పారితోషికం కూడా తీసుకోకుండానే ఈ మూవీ చేశాడట. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండే మౌలిక వసతులను మాత్రం ఉపయోగించుకున్నారు. మూవీ మేకింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈ రెండు ఉచితంగా లభించడంతో.. మిగిలిన బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కేవలం కోటి రూపాయల్లోనే సినిమాను కంప్లీట్ చేయడం విశేషం.

అయితే.. క్షణం-పెళ్లిచూపులు చిత్రాలకు జాగ్రత్తగా డిఫరెంట్ గా ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేయడం బాగా హెల్ప్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే మూవీ మేకింగ్ కి ఎంత వెచ్చించారో.. ప్రమోషన్స్ కు కూడా దాదాపు అంతే ఖర్చుపెట్టారు. ఈ విషయంలో డోనరుడు కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/