Begin typing your search above and press return to search.
కారవాన్లు లేకుండా చేశామంటున్న సుమంత్
By: Tupaki Desk | 2 Nov 2016 9:30 AM GMTతొలిసారి స్వీయ నిర్మాణంలో ‘నరుడా డోనరుడా’ సినిమా చేశాడు సుమంత్. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడు నాగ్ మేనల్లుడు. ఐతే ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో తీర్చిదిద్దడానికి తమకు స్ఫూర్తి ‘క్షణం’ సినిమానే అంటున్నాడు సుమంత్. ‘క్షణం’ సినిమాను పరిమితమైన బడ్జెట్లో అద్భుతమైన క్వాలిటీతో తెరకెక్కించారని.. తాము కూడా ‘నరుడా డోనరుడా’ విషయంలో అలాగే ప్రయత్నించామని సుమంత్ తెలిపాడు.
‘‘మా సినిమాకు ఏం అవసరమో అదే సమకూర్చాం. ఖర్చు పెట్టుకునే స్థాయి ఉంది కాబట్టి.. ఏదైనా చేయడానికి మేం సిద్ధపడలేదు. క్షణం టీం చాలా తక్కువ బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేయడం చూసి.. మేం కూడా అదే దారిలో ప్రయాణించాలనుకున్నాం. ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లనే మేమూ తీసుకున్నాం. ఫిలిం స్కూల్లో విద్యార్థులంతా కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినట్లుగా ఈ సినిమాకు పని చేశాం. అందరూ తమ సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగించారు. నటీనటులు కారవాన్లు సహా చాలా లగ్జరీస్ వదులుకున్నారు. అవేమీ లేకుండానే సినిమా పూర్తి చేయొచ్చని చూపించాం. ఇకపైనా ఇలాగే సినిమాలు చేయాలని ఉంది. ‘క్షణం’ యూనిట్ స్ఫూర్తితో మేం చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది’’ అని సుమంత్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/