Begin typing your search above and press return to search.

సుమంత్‌ హీరోయిన్‌ మంచులక్ష్మీ!

By:  Tupaki Desk   |   12 April 2015 3:00 PM IST
సుమంత్‌ హీరోయిన్‌ మంచులక్ష్మీ!
X
అవును నిజం. కాకపోతే ఇది కొత్త సినిమా కబురు కాదు. సుమంత్‌ తొలి సినిమా సంగతి. ఏఎన్నార్‌ మనవడైన సుమంత్‌ 'ప్రేమకథ'తో కథానాయకుడిగా తెరకు పరిచయమయ్యాడు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కథానాయికగా తొలుత మంచు లక్ష్మీప్రసన్నని ఎంచుకోవాలని అనుకొన్నారట. కానీ మోహన్‌బాబు ఏమంటారో అని భయపడి.. ఆ నిర్ణయాన్ని మార్చుకొన్నారట. ఆ విషయాన్ని ఇటీవల స్వయంగా బయట పెట్టారు సుమంత్‌. 'నాకు లక్ష్మీప్రసన్న చిన్నప్పట్నుంచే తెలుసు. మేం మంచి ఫ్రెండ్స్‌. ఆమెతో కలిసి నటించాలని ఉండేది. అందుకే నా తొలి చిత్రానికి ఆమెనే కథానాయికగా ఎంచుకోవాలనుకొన్నా. కానీ మోహన్‌బాబుగారికి భయపడి వెనక్కి తగ్గా' అని దొంగాట ఆడియో వేడుకలో చెప్పుకొచ్చాడు సుమంత్‌.

లక్ష్మీప్రసన్న అప్పుడే కథానాయికగా తెరకు పరిచయమయ్యుంటే మాత్రం నిజంగా ఆమె కెరీర్‌ ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉండేది. కానీ అప్పట్లో మోహన్‌బాబుకి లక్ష్మీ సినిమాల్లోకి రావడం ఇష్టం ఉండేది కాదట. దీంతో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె సినిమాలపైనే మక్కువ పెంచుకొని నటన, నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు విలన్‌గానూ, కథానాయికగానూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొంటోంది. అయితే ఎప్పుడో ఒకసారి తప్పకుండా లక్ష్మీప్రసన్నతో కలిసి నటిస్తానని సుమంత్‌ 'దొంగాట' ఆడియో వేడుకలో చెప్పుకొచ్చారు.