Begin typing your search above and press return to search.
నా సినిమాల్లో ఎప్పుడో ఆ సీన్స్ ను మానేశా
By: Tupaki Desk | 4 Feb 2021 2:11 PM GMTఅక్కినేని హీరో సుమంత్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్బంగా హైటెక్ సిటీలో జరిగిన ఒక క్యాన్సర్ అవగాహణ ర్యాలీలో పాల్గొన్నాడు. పెద్ద ఎత్తున జరిగిన ఆ ర్యాలీలో సుమంత్ పాల్గొని క్యాన్సర్ పట్ల అవగాహణ కల్పించాడు. ఆ సందర్బంగా మాట్లాడుతూ తాత గారు క్యాన్సర్ తో మృతి చెందడం చాలా బాధ అనిపించింది. క్యాన్సర్ తో పోరాటం అంటే మామూలు విషయం కాదు. ఆరంభ దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నాడు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెడు అలవాట్ల కారణంగా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సుమంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తమ ఫ్యామిలీలో ఎంతో మంది క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. అలాగే కొందరు క్యాన్సర్ ను జయించి సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు. తన సినిమాల్లో సిగరెట్ తాగే సీన్స్ ను ఎప్పుడో మానేశాను. ఎవరైనా సిగరెట్ తాగాలంటూ కోరినా కూడా నేను సున్నితంగా అవసరమా అంటూ ప్రశ్నిస్తాను. అతి తక్కువ సందర్బాల్లో పాత్రకు తప్పకుండా సిగరెట్ స్మోకింగ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తే అప్పుడు తక్కువ సీన్స్ లో సిగరెట్ తాగినట్లుగా నటిస్తాను తప్ప సిగరెట్ సీన్స్ ను తన సినిమాల నుండి తొలగించినట్లుగా చెప్పుకొచ్చాడు.