Begin typing your search above and press return to search.

ఫోటోగ్రాఫర్ గా అక్కినేని అల్లుడు

By:  Tupaki Desk   |   2 Jan 2018 2:30 AM GMT
ఫోటోగ్రాఫర్ గా అక్కినేని అల్లుడు
X

టాలీవుడ్ లో అక్కినేని హీరోస్ మంచి హిట్స్ అందుకుంటున్నా వారి సపోర్ట్ తో వచ్చిన వారి కుటుంబ సభ్యులలోని కుర్ర హీరోలు మాత్రం అంతగా హిట్స్ అందుకోవడం లేదు. నాగార్జున తరువాత ఇండస్ట్రీ కి పరిచయం అయిన మేనల్లుడు సుమంత్ మొదట్లో కొంచెం డిఫెరెంట్ గా ట్రై చేసి నటనతో ఆకట్టుకోవడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకున్నాడు. కానీ ఆ తరువాత కొన్నేళ్లకే పెద్దగా హిట్స్ అందుకోలేదు.

ఆ మధ్య మాస్ లుక్ లో ట్రై చేసి కొన్ని పరాజయాలను చూశాడు. అయితే కాలానికి తగ్గట్టుగా మారాలని ఈ హీరో డిసైడ్ అయ్యాడు. అందుకే రీసెంట్ గా మళ్లీ రావా అనే రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఏ సెంటర్లలో ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. స్వీట్ మెలోడీ డ్రామాగా తెరకెక్కడంతో ఓ వర్గం యువతకి బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హిందీ టీవీ సిరియాల్ యాక్టర్ ఆకాంక్ష సింగ్ అందరిని ఆకట్టుకుంది.

అయితే మళ్లీ రావా సినిమా ఇచ్చిన హిట్ తో మళ్లీ అదే ఉపును కంటిన్యూ చేయాలని సుమంత్ ఆలోచిస్తున్నాడు. అందుకే ఒక స్పెషల్ మూవీని ఒకే చేసినట్లు తెలుస్తోంది. అందులో మనోడు న్యూస్ ఫోటోగ్రాఫర్ గా కనిపించబోతున్నాడట. మంచి థ్రిల్లర్ కథాంశంతో ఆ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అంతే కాకుండా కొంచెం భారీగానే సినిమాను నిర్మించాలని సుమంత్ అనుకుంటున్నాడాట. మరి ఆ సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.