Begin typing your search above and press return to search.
నారి నారి డోనారి.. అంటున్న సుమంత్
By: Tupaki Desk | 8 Aug 2016 5:00 PM ISTడొనేట్ చేసేవాడిని డోనార్ అంటారు. ఇక స్పెర్మ్ డొనేట్ చేసేవాడ్ని స్పెర్ప్ డోనార్ అంటారు. మరి విక్కీ అనే అబ్బాయి స్పెర్మ్ డొనేట్ చేస్తుంటే వాడిని ఏమనాలి? ''విక్కీ డోనార్'' అన్నారు అప్పట్లో బాలీవుడ్ వారు. ఈ సినిమాను ఒకవేళ తెలుగులో తీస్తే ఏమనాలి సారూ?
అప్పట్లో హీరో సిద్దార్ధ్ కూడా తెలుగులో విక్కీ డోనర్ రీమేక్ చేయాలని అనుకున్నాడు. కాని అప్పటికే సినిమా రైట్లను దర్శకనిర్మాత మధుర శ్రీధర్ కొనేసుకోవడంతో మనోడు ఆ ఐడియాను డ్రాప్ చేసుకున్నాడు. తరువాత ఏమైందో తెలియదు కాని.. ఒక కొత్త దర్శకుడి డైరక్షన్లో అనూహ్యంగా సుమంత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కేసింది. దాదాపు రిలీజ్ కు రెడీ అనే చెప్పాలి. ఈ సినిమాకు పలు పేర్లను ఆలోచించి.. చివరకు ''నారి నారి డోనారి'' అనే టైటిల్ పెడదామని ఫిక్సయినట్లు అన్నపూర్ణ స్టూడియో వర్గాల ద్వారా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫస్టు కాపీని చూసిన నాగ్ కూడా.. ఈ దెబ్బకి సుమంత్ కెరియర్ రివైవ్ అయిపోవడం ఖాయం అని అంటున్నారట.
టైటిల్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా కాన్సెప్టు మాత్రం చాలా షాకింగ్ అనే చెప్పాలి. బాలీవుడ్ లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమాకు బాగా కనక్ట్అయ్యారు. మరి తెలుగులో ఆడియన్స్ ఎలా కనక్టవుతారు అనే విషయం చూడాల్సిందే.